అనంతపురం : జాతీయ స్థాయిలో రాణించిన మలుగూరు గురుకుల విద్యార్థి కె.చందు ఆకాష్‌ను పాఠశాల యాజమాన్యం అభినందించారు. గురువారం ఉదయం పీడీ ఎల్లారెడ్డి, ప్రిన్సిపల్ కె.నాగమణి లు మాట్లాడుతూ.. అనంతపురం జిల్లా హిందూపురం రూరల్ మండలంలోని ప్రభుత్వ బాలయోగి గురుకులం, మలుగూరుకు చెందిన పదవ తరగతి విద్యార్థి కె.చందు ఆకాష్ అనే ఎస్జిఎఫ్ అండర్ 17 రాష్ట్ర స్థాయి పోటీలలో లాంగ్ జంప్‌లో ద్వితీయ స్థానం, త్రిబుల్ జంప్ లో తృతీయ స్థానం సాధించి జాతీయ స్థాయికి ఎంపికైనట్లు తెలిపారు. జాతీయ స్థాయి పోటీలలో మెరుగైన ప్రతిభ కనబరచాలని ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థి ఆకాష్‌ను అభినందించారు. గత ఏడాది కూడా ఆకాష్.. హ్యాండ్‌బాల్, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్ లో ఇంటర్ స్టేట్ లెవెల్ లో మొదటి స్థానం సాధించినట్లు, జోన్ 4 లో స్పోర్ట్స్ లో ఐదు ఈవెంట్లలో పథకాలు సాధించి వ్యక్తిగత ఛాంపియన్ సాధించినట్లు పీడీ తెలిపారు. పాఠశాల వైస్ ప్రిన్సిపల్ నారాయణ, ఉపాధ్యాయులు దామోదర, రసూల్ సాహెబ్, బాలచంద్రుడు, వెంకట సుబ్బయ్య, వసంత కుమారి, లోకనాథ్, పిఈటి ఉదయ్ లు విద్యార్థి ఆకాష్ ను పొగడ్తలతో ముంచెత్తారు.