* బ్రిటిష్ మీడియా వెల్లడి
లండన్: ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాలలో బ్రిటిష్ సైనిక దళాలు సామాన్య పౌరులపై కొనసాగించిన యుద్ధనేరాల విషయంలో అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసిసి) దర్యాప్తు చేసే అవకాశాలున్నాయని బ్రిటిష్ మీడియా సోమవారం తన వార్తా కథనాలలో వెల్లడించింది. బ్రిటన్ సైనిక దళాలు మధ్యప్రాచ్యంలో కొనసాగిన యుద్ధ సమయాలలో చిన్నారులతో సహా అనేక మందిపై కొనసాగించిన 'హత్యా'చారాలను బ్రిటిష్ ప్రభుత్వం తొక్కిపట్టినట్లు సోమవారం మీడియా తన కథనాలలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ కథనాలను బ్రిటన్ రక్షణ మంత్రిత్వశా ఖండించినప్పటికీ, తాము వీటిని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఐసిసి వెల్లడించినట్లు మీడియా తన కథనాలలో పేర్కొంది. యుద్ధ నేరాలను తొక్కిపెట్టినట్లు వచ్చిన కథనాలపై స్పందించాలని ప్రతిపక్ష లేబర్ పార్టీ జాన్సన్ సర్కారును డిమాండ్ చేసింది. మీడియా తన కథనాలలోవెల్లడించిన వాస్తవాలను నిర్ధారించుకునేందుకు ఐసిసి స్వతంత్రంగా దర్యాప్తు జరుపుతుందని, మీడియా సోమవారం నాటి తన కథనంలో వెల్లడించింది.
ఇరాక్, ఆఫ్ఘన్లలో బ్రిటిష్ యుద్ధ నేరాలపై ఐసిసి దర్యాప్తు
