* అభ్యర్ధుల ఎంపికపై డెమొక్రాట్స్కు ఒబామా సూచన
వాషింగ్టన్: రానున్న అధ్యక్ష ఎన్నికల అభ్యర్థుల ఎంపిక విషయంలో మరీ వామపక్ష (లెఫ్ట్) భావజాలమున్న వ్యక్తులకు ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం లేదని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా డెమొక్రాటిక్ పార్టీ నేతలకు సూచించారు. ఆదివారం ఇక్కడ జరిగిన పార్టీ ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ సూచన చేశారు. అయితే నిర్దిష్టమైన అభ్యర్థి లేదా విధాన ప్రతిపాదన వంటి అంశాలను ఆయన ప్రస్తావించలేదు. వామపక్షభావజాలం కొంతమేరకు వున్న వ్యక్తిని డెమొక్రాట్స్తోపాటు ఇండిపెండెంట్లు, మితవాద రిపబ్లికన్ ఓటర్లు సమర్ధించే అవకాశం వుందని ఆయన అన్నారు. ట్విట్టర్ ఫిడ్లలో లేదా పార్టీ కార్యకలాపాలలో ఆయన వామపక్ష భావజాలం మరీ స్పష్టంగా కన్పించకుండా వుంటే చాలని ఆయన అభిప్రాయపడ్డారు.
మరీ 'లెఫ్ట్'కు పోవద్దు...!
