* పాత్రికేయులకు శుభాకాంక్షలు తెలిపిన చిన్నారులు
తూర్పు గోదావరి : తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలంలోని శంకరగుప్తం గ్రామం దిండ మెరక ప్రాథమిక పాఠశాల విద్యార్థులు వినూత్న రీతిలో నో బ్యాగ్ డే జరుపుకున్నారు. సమీపంలో ఉన్న సముద్రం వద్ద చిన్నారులు ఆటపాటలతో సంతోషంగా గడిపారు. ఈ సందర్భంగా ఇసుకలో పాత్రికేయులకు శుభాకాంక్షలు అని వ్రాసి శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయులు శ్రీనివాస్, భాస్కరరావులు విద్యార్థులకు సముద్రంలోని జీవరాసుల గురించి వివరించారు. పిల్లలచే ఆటలాడించారు. విద్యార్థులు పాటలు పాడుతూ డాన్సులు వేస్తూ సంతోషంగా కాలక్షేపం చేశారు. విద్యార్థుల మానసిక ఉల్లాసానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అధ్యాపకులు తెలియజేశారు. కేవలం పుస్తకాలు చదివడం వల్ల విద్యార్థులు మంచి భవిష్యత్ చూడలేరని బయట ప్రపంచంలో జరిగే వాటిని తెలుసుకోవడం ద్వారా విద్యార్థుల మేధస్సు పెరుగుతుందన్నారు.
