తూర్పు గోదావరి : తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడలో ఇసుక ర్యాంపు ప్రారంభమైంది. ఇసుక ర్యాంపును మంత్రులు అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబులు ప్రారంభించారు. కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు, పియుసి చైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి, కలెక్టర్ మురళీధర్ రెడ్డి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.