ప్రజాశక్తి- అమరావతి బ్యూరో:
టిడిపి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు దేవినేని అవినాష్ వైసిపిలో చేరారు. అవినాష్‌తో పాటు విజయవాడకు చెందిన టిడిపి నేత కడియాల బుచ్చిబాబు తదితరులకు పార్టీ కండువా కప్పి జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాస్, విజయవాడ తూర్పు నియోజక వర్గ ఇన్‌ఛార్జి బొప్పన భవకుమార్ తదితరులు పాల్గొన్నారు. సిఎం జగన్ చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఆకర్షించడంతో పార్టీలో చేరినట్లు అనంతరం అవినాష్ మీడియాతో చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు.
వైసిపిలో చేరిన దేవినేని అవినాష్
