న్యూఢిల్లీ : మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి సిఫార్సుకు అనుగుణంగా ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు మంగళవారం మధ్యాహ్నం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఆమోద ముద్ర వేసినట్టు సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మహారాష్ట్రలో ఏ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమై సంఖ్యా బలం లేనందున గవర్నర్ సిఫార్సును పరిగణనలోకి తీసుకుని కేంద్ర కేబినెట్ రాష్ట్రపతి పాలనకు ప్రతిపాదించింది. మహారాష్ట్ర అసెంబ్లీలో బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 145 స్ధానాల మేజిక్ ఫిగర్‌కు చాలా దూరంలో నిలవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆసక్తి కనబరచలేదు. మరోవైపు రెండో అతిపెద్ద పార్టీగా శివసేనను గవర్నర్ ఆహ్వానించినా బలనిరూపణకు డెడ్‌లైన్ పొడిగించాలన్న వినతిని గవర్నర్ తోసిపుచ్చారు. ఇక మూడో అతిపెద్ద పార్టీ ఎన్సీపీని మంగళవారం రాత్రి 8.30 గంటల్లోగా బలనిరూపణ చేసుకోవాలని కోరుతూ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం అందింది. ఈ దిశగా ఎన్సీపీ..కాంగ్రెస్, శివసేనలతో సంప్రదింపులు జరుపుతుండగానే రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు చేయడం, ఇందుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిందనే ప్రచారం సాగుతుండటంపై విపక్షాలు విస్మయం వ్యక్తం చేశాయి. మరోవైపు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసినట్టు వచ్చిన వార్తలను రాజ్‌భవన్ వర్గాలు తోసిపుచ్చాయి.
Home »
తాజా వార్తలు »
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర కేబినెట్ ఆమోదం

సంబందిత వార్తలు
-
రాజధానిపై స్పష్టమైన విధానం ప్రకటించి కేంద్రం నుండి నిధులు సాధించాలి
-
దిశకు న్యాయం జరిగింది : మంత్రి, ఎమ్మెల్యేల స్పందన
-
గడిచిన రెండేళ్ళలో 100 మంది ఉగ్రవాదులు అరెస్టు
-
మరో వివాదంలో సాక్షి మహారాజ్
-
నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా జస్టిస్ ఎన్వీ రమణ
-
144కి మూడు వికెట్లు కోల్పోయిన విండీస్
-
వాలీ బాల్ పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థినిలు
-
తెలంగాణ పోలీసులకు ఎన్హెచ్ఆర్సి నోటీసులు
-
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
-
ఈ రాత్రికే నిందితుల అంత్యక్రియలు
-
వివాహిత ఆత్మహత్య
-
విశాఖలో ఉల్లి కోసం తోపులాట.. స్పృహ తప్పిన వినియోగదారులు
-
నా భర్తను చంపినచోటే నన్ను చంపండి : నిందితుడి భార్య
-
నిర్భయ కేసులో వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ ను తోసిపుచ్చండి
-
ఈ రోజు నలుగురు భారత క్రికెటర్ల బర్త్ డే!
-
మోడీకి ఘన స్వాగతం పలికిన ఉద్ధవ్ థాకరే
-
ఎన్కౌంటర్ నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం
-
'దిశ' ఇంటి వద్ద భద్రత పెంపు
-
ఫ్లాగ్ ఫండ్ సేకరించిన వారికి గవర్నర్ సత్కారం
-
అంబేద్కర్ కు ఏలూరు రూరల్ పోలీసుల నివాళి
-
జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఈ చలానా క్లియరెన్స్‌లకు శ్రీకారం
-
కేవలం కృతజ్ఞతలు చెప్పి ధోనీకి వీడ్కోలు పలకలేం: గంగూలీ
-
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ప్రముఖుల స్పందన
-
మిస్ మ్యాచ్ మూవీ రివ్యూ
-
రేపిస్టులపై దయ చూపాల్సిన అవసరం లేదు : రాష్ట్రపతి
-
అత్యాచారాలు, హత్యలు అరికట్టాలంటే కఠిన చట్టాలు రూపొందించాలి : మహిళా సంఘాలు
-
బాబ్రీ మసీదును ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి: సీపీఐఎంఎల్ లిబరేషన్
-
అంబేద్కర్ కు ప్రత్తిపాడులో న్యాయమూర్తుల నివాళి
-
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మలికిపురం విద్యార్ధినుల హర్షం
-
పెనుమంట్రలో అంబేద్కర్ 63వ వర్థంతి