అమరావతి : పల్నాడు ప్రాంతంలో ఏదో జరగుతోందంటూ అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఎపి హోంమంత్రి సుచరిత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గురువారం సుచరిత మీడియాతో మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఉన్న పల్నాడులో టిడిపి అలజడి సృష్టిస్తోందని మండిపడ్డారు. ఇలాంటి ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరారు. దళితులను కించపరుస్తూ మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. వైసిపి కార్యకర్తలపై కూడా కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. టిడిపి నేతలు దళిత మహిళా ఎస్సై ను కులం పేరుతో దూషించడం తప్పని అన్నారు. సదరు మహిళా ఎస్సై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. త్వరలోనే భారీ రిక్రూట్ మెంట్ జరుగుతుందని... పోలీసు శాఖలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేస్తామని సుచరిత వెల్లడించారు.