ఢిల్లీ : బిజెపి సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ పార్థీవ దేహాన్ని కొద్దిసేపటి క్రితమే ఢిల్లీలోని కైలాస్ కాలనీలోని జైట్లీ స్వగృహం నుంచి బిజెపి ప్రధాన కార్యాలయానికి తరలించారు. మధ్యాహ్నం 1.30 ల వరకు ప్రధాన కార్యాలయంలో జైట్లీ పార్థీవదేహంను సందర్శనార్థం ఉంచనున్నారు. 2 గంటలకు ప్రధాన కార్యాలయం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు నిగమ్బోధ్ ఘాట్లో జైట్లీ అంతిమ సంస్కారాలు జరగనున్నాయి.
