లండన్ : పాకిస్తాన్లో కొనసాగుతున్న ప్రెస్ సెన్సార్షిప్ను నిరసిస్తూ లండన్‌లో కొనసాగుతున్న ఆందోళనల కారణంగా పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీకి గురువారం చేదు అనుభవం ఎదురయింది. పాక్ ప్రభుత్వం నుండి అందిన ఫిర్యాదుతో తన సోషల్ మీడియా ఖాతాను సస్పెండ్ చేశారంటూ కెనడియన్ జర్నలిస్టు ఒకరు నిలదీయటంతో ఆయన కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. 'పత్రిక స్వేచ్ఛ పరిరక్షణ' (డిఫెండ్ మీడియా ఫ్రీడం) పేరుతో గురువారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన వచ్చినపుడు ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం జైలులో వున్న పాక్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ ఆలీ జర్దారీ ఇంటర్వ్యూను ప్రసారం చేసిన మూడు ప్రైవేట్ టీవీ ఛానళ్ల ప్రసారాలను పాక్ ఎలక్ట్రానిక్ మీడియా నియంత్రణా వ్యవస్థ (పెమ్రా) నిలిపివేసిన కొద్ది రోజులకు ఈ ఘటన జరగటం గమనార్హం. మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ ఆలీ జర్దారీ, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ వంటి జైలుపాలయిన రాజకీయ నేతల కొమ్ముకాస్తున్న మూడు ప్రైవేట్ టీవీ ఛానళ్ల ప్రసారాలను సస్పెండ్ చేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించటంతో పెమ్రా ఈ చర్య తీసుకుంది. కెనడియన్ పొలిటికల్ వెబ్సైట్ రెబల్ మీడియాకు చెందిన జర్నలిస్టు ఎజ్రాలివాంట్ తన ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేయటంపై మీడియా సమావేశానికి హాజరవుతున్న మంత్రి ఖుర్షీద్‌ను నిలదీసినపుడు ఈ ఘటన జరిగినట్లు డాన్ పత్రిక తన వార్తా కథనంలో వివరించింది. కెనడాకు చెందిన తన ఖాతాను పాక్ ప్రభుత్వం ఏ విధంగా సెన్సార్ చేస్తుందంటూ ఆయన నిలదీసినట్లు తెలుస్తోంది. పత్రికా స్వేచ్ఛ విషయంలో పాకిస్తాన్ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోందని ఆయన మంత్రిని విమర్శించినట్లు డాన్ పత్రిక వెల్లడించింది. ఈ విమర్శలపై స్పందించిన పాక్ మంత్రి ఖురేషీ 'మీ మనోభావాలను గౌరవించాలంటూ అడగాల్సిన పద్ధతి ఇది కాద'ని లెవాంట్‌కు సూచించారు. 'కొన్ని నిర్దిష్ట ఎజెండాలను లక్ష్యంగా పెట్టుకొని పత్రికా స్వేచ్ఛ పేరిట మీరు ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తున్నారని' ఖురేషీ లెవాంట్‌పై అసహనం వ్యక్తం చేశారు. పెమ్రా ఇటీవలి నిర్ణయాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ తాము జర్నలిస్టులను అడ్డుకునే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. అదిలించి, బెదిరించి మీడియా నోరు నొక్కే కాలం పోయిందని, ఇప్పుడు సోషల్ మీడియా విస్తరించటంతో భావ ప్రకటనా స్వేచ్ఛ కొత్తపుంతలు తొక్కుతోందని ఆయన వివరించారు.
Home »
తాజా వార్తలు »
పాక్ విదేశాంగ మంత్రికి లండన్‌లో చేదు అనుభవం

సంబందిత వార్తలు
-
మృతదేహాలను ఈ నెల 9 వరకు భద్రపరచాలి : హైకోర్టు ఆదేశం
-
పాకిస్తాన్‌కు 130 కోట్ల డాలర్ల ఆసియా బ్యాంకు రుణం
-
రాజధానిపై స్పష్టమైన విధానం ప్రకటించి కేంద్రం నుండి నిధులు సాధించాలి
-
దిశకు న్యాయం జరిగింది : మంత్రి, ఎమ్మెల్యేల స్పందన
-
గడిచిన రెండేళ్ళలో 100 మంది ఉగ్రవాదులు అరెస్టు
-
మరో వివాదంలో సాక్షి మహారాజ్
-
నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా జస్టిస్ ఎన్వీ రమణ
-
144కి మూడు వికెట్లు కోల్పోయిన విండీస్
-
వాలీ బాల్ పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థినిలు
-
తెలంగాణ పోలీసులకు ఎన్హెచ్ఆర్సి నోటీసులు
-
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
-
ఈ రాత్రికే నిందితుల అంత్యక్రియలు
-
వివాహిత ఆత్మహత్య
-
విశాఖలో ఉల్లి కోసం తోపులాట.. స్పృహ తప్పిన వినియోగదారులు
-
నా భర్తను చంపినచోటే నన్ను చంపండి : నిందితుడి భార్య
-
నిర్భయ కేసులో వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ ను తోసిపుచ్చండి
-
ఈ రోజు నలుగురు భారత క్రికెటర్ల బర్త్ డే!
-
మోడీకి ఘన స్వాగతం పలికిన ఉద్ధవ్ థాకరే
-
ఎన్కౌంటర్ నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం
-
'దిశ' ఇంటి వద్ద భద్రత పెంపు
-
ఫ్లాగ్ ఫండ్ సేకరించిన వారికి గవర్నర్ సత్కారం
-
అంబేద్కర్ కు ఏలూరు రూరల్ పోలీసుల నివాళి
-
జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఈ చలానా క్లియరెన్స్‌లకు శ్రీకారం
-
కేవలం కృతజ్ఞతలు చెప్పి ధోనీకి వీడ్కోలు పలకలేం: గంగూలీ
-
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ప్రముఖుల స్పందన
-
మిస్ మ్యాచ్ మూవీ రివ్యూ
-
రేపిస్టులపై దయ చూపాల్సిన అవసరం లేదు : రాష్ట్రపతి
-
అత్యాచారాలు, హత్యలు అరికట్టాలంటే కఠిన చట్టాలు రూపొందించాలి : మహిళా సంఘాలు
-
బాబ్రీ మసీదును ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి: సీపీఐఎంఎల్ లిబరేషన్
-
అంబేద్కర్ కు ప్రత్తిపాడులో న్యాయమూర్తుల నివాళి