- ఏకగ్రీవంగా సమర్దించిన ఆసియా - పసిఫిక్ గ్రూప్
ఐక్యరాజ్యసమితి: ఐరాస భద్రతామండలిలో శాశ్వతేతర సభ్యత్వం కోసం పోటీ పడుతున్న భారత్ అభ్యర్థిత్వాన్ని తాము గట్టిగా సమర్ధిస్తున్నట్లు ఆసియా-పసిఫిక్ దేశాల గ్రూప్ ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఐరాసలో శాశ్వతేతర సభ్యత్వం కోసం పోటీ పడుతున్న భారత్‌కు తాజాగా లభించిన దౌత్య విజయమిది. రెండేళ్ల వ్యవధి కలిగిన ఈ సభ్యత్వానికి భారత్‌ను తాము గట్టిగా సమర్ధిస్తున్నట్లు 15 దేశాలతో కూడిన ఆసియా-పసిఫిక్ గ్రూప్ తమ తీర్మానంలో స్పష్టం చేసింది. మండలిలో 2021-22 కాలానికి ఐదుగురు శాశ్వతేతర సభ్యులను ఎన్నుకునేందుకు వచ్చే ఏడాది జూన్‌లో ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. 2021-22 కాలానికి భద్రతా మండలి సభ్యత్వం కోసం పోటీ పడుతున్న భారత్‌ను గట్టిగా సమర్ధిస్తున్నట్లు ఆసియా- పసిఫిక్ గ్రూప్ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించిందని, ఈ గ్రూప్‌తో పాటు భారత్‌ను సమర్ధిస్తున్న మొత్తం 55 దేశాలకూ తాము కృతజ్ఞలు తెలియచేస్తునాన్మని ఐరాసలో భారత శాశ్వత రాయబారి ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ మంగళవారం ఒక ట్వీట్లో వెల్లడించారు. భద్రతా మండలిలో సభ్యులుగా రెండేళ్ల కాలపరిమితితో ఏటా ఐదుగురు సభ్యులను జనరల్ అసెంబ్లీ ఎన్నుకుంటున్న విషయం తెలిసిందే. మండలిలో చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్, అమెరికాలు శాశ్వత సభ్యదేశాలుగా కొనసాగుతున్నాయి.
మండలిలో సభ్యత్వానికి భారత్ అభ్యర్థిత్వం..!
