- జిల్లా ఎస్పీ దామోదర్
ప్రజాశక్తి కంటోన్మెంట్
విజయనగరం లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు సహకరించాలని జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. మంగళవారం రాత్రి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న స్థానిక జొన్నగుడ్డి లో ఎన్నికలు నియమావళి పై ప్రజలకు అవగహన సద్దసు లో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి అని,అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తో సహకరించాలి అని తెలిపారు. మద్యం, డబ్బు లాంటి ప్రలోభాలుకి గురిచేస్తే మాకు సమాచారం ఇవ్వాలి అని తెలిపారు. ఓటుని అమ్ముకోవద్దు అని ఓటు హక్కు ద్వారా మంచి నాయకులను ఎన్నుకోవాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ సూర్య శ్రవణ్ కుమార్, సిఐ యర్రం నాయుడు, ఎస్.ఐ. ప్రసాద్, కిరణ్, రోహిణి పతి , అధిక సంక్యులో ప్రజలు తదితరులు పాల్గొన్నారు...
ఎన్నికలు ప్రశాంతంగా జరిపేందుకు సహకరించండి
