పశ్చిమ గోదావరి : ముఖ్యమంత్రి చంద్రబాబు సభ అనుకున్న సమయం కంటే 3 గంటలు ఆలస్యం కావడంతో.. సభకు విచ్చేసిన ప్రజలు ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శనివారం ఉదయం పాలకొల్లులో నిర్వహించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ సభ అనుకున్న సమయాని కంటే 3 గంటలు ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో.. ముఖ్యమంత్రి బహిరంగ సభకు నిర్ణీత సమయం 10 గంటలకే వచ్చిన మహిళలంతా ఎండ ధాటిని తట్టుకోలేక అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే 12 గంటలు దాటడంతో.. భానుడి ధాటికి తెలుగు ఆడపడుచులు ఉక్కపోత అనుభవిస్తున్నారు.
