బెంగళూరు : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మోడీ నేతృత్వంలోని బిజెపిని గద్దెదించేందుకు ప్రతిపక్షాలు కూటమి కట్టినప్పటికీ, ప్రధాని అభ్యర్థిపై ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ మేలో జరిగే ఎన్నికల్లో తమ కూటమి గెలిచిన అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీనే ప్రధాని పీఠాన్ని అధిరోహించాలని భావిస్తున్నట్లు కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వంలోని జెడిఎస్ పార్టీ తన మనసులో మాటను బయటపెట్టింది. ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు తాము నిరంతరం కృషి చేస్తామని ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. అయితే గతంలో ఆ పదవికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సరైన అభ్యర్థి అని కూడా వ్యాఖ్యానించారు. ఆ పదవికి రాహుల్ అర్హుడని, ప్రధాని అభ్యర్థిగా ఆయనకు మద్దతునిస్తామని కుమారస్వామి వెల్లడించారు. తన తండ్రి, మాజీ ప్రధాని దేవేగౌడ కూడా అదే భావనలో ఉన్నారని అన్నారు. బిజెపితో పోల్చుకుంటే ప్రాంతీయ పార్టీలు పాటు పలువురు సమర్థవంతమైన నేతలు ఉన్నారని, మమతా బెనర్జీ, మాయవతి లాంటి వారు ప్రధాని పదవికి అర్హులేనని, కానీ తమ పార్టీ మాత్రం రాహుల్‌కే పట్టం కట్టాలని భావిస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయనకు ప్రధాని పదవికి సమర్ధుడేనా అన్న సందేహాలపై మాట్లాడుతూ మోడీ కన్నా రాహుల్ ఏదైనా చేయగలడని ధీమా వ్యక్తం చేశారు. మోడీ 'పేపర్ టైగర్' మాత్రమే అని, రాహుల్ పరిపక్వం చెందిన రాజకీయ నేతని అన్నారు. మోడీ మంచి మాటకారి అయినప్పటికీ, ఈ నాలుగున్నరేళ్లలో చేసిందేమిటని ప్రశ్నించారు.
Home »
తాజా వార్తలు »
ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌కు మద్దతిస్తాం : కుమారస్వామి

సంబందిత వార్తలు
-
జమ్మూకాశ్మీర్‌లో భూకంపం
-
విజయవాడలో తాగి స్కూలుకు వస్తున్న విద్యార్థినులు..
-
నేటి నుంచి కుల్‌భూషణ్ జాదవ్ కేసుపై విచారణ
-
ఏపీ జల వనరుల శాఖకు కేంద్రం అవార్డు
-
నైజీరియా అధ్యక్ష ఎన్నికలు వాయిదా
-
9 మంది కోడిపందాల రాయుళ్లు అరెస్టు
-
బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం
-
లారీ ఢీకొని ముగ్గురు యువకులు మృతి
-
పాక్‌లో ఆత్మాహుతి దాడి : 9మంది సైనికులు మృతి
-
వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థిగా జంగా కృష్ణమూర్తి
-
ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు : 10 మంది మావోయిస్టులకు గాయాలు
-
కొండవీడుకోట ఉత్సవాలు ప్రారంభం
-
అమర జవాన్ల కుటుంబాలకు బిసిసిఐ విరాళం రూ.5 కోట్లు!
-
జనసేన అభ్యర్థిత్వం కోసం..ఆలుమగల దరఖాస్తులు
-
వరల్డ్ కప్‌లో భారత్..పాక్‌తో ఆడకూడదు : సిసిఐ
-
ఘనంగా ఆసియా విజన్ అవార్డుల వేడుక
-
ఒకే కాన్పులో ఏడుగురు జననం
-
టిటిడి బోర్డు సభ్యులుగా మరో ఇద్దరికి అవకాశం
-
ఐదేళ్లలో బిసిలకు రూ.75 వేల కోట్లు ఖర్చు చేస్తాం : వైఎస్ జగన్
-
అనుచిత ప్రవర్తనకు పాల్పడుతున్న ఉపాధ్యాయుడిపై చర్యలు : ఐద్వా డిమాండ్
-
వివాహిత మృతి.. భర్తపైనే అనుమానం
-
విమానంకు తప్పిన ప్రమాదం
-
మాజీ ఎమ్మెల్యే కుమారుడి ఆత్మహత్యా యత్నం
-
నేను బీసీల కోసం పాటుపడే తీవ్రవాదిని : ఆర్.కృష్ణయ్య
-
‘అన్నదాతా సుఖీభవ’ సాయంపై జీవో విడుదల
-
అమర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించిన జగన్
-
బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదు : వైసిపి నేత తమ్మినేని
-
అమలు కాని హామీలతో చంద్రబాబు బీసీలను మోసం చేశారు
-
వివాహిత అనుమానాస్పద మృతి!
-
చంద్రబాబువి ఓటు బ్యాంక్ రాజకీయాలు : బొత్స