దేశంలో మూడో ఫ్రంట్, నాలుగో ఫ్రంట్లకు అవకాశం లేదని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఇవాళ చిత్తూరులో ఆయన మాట్లాడుతూ బీజేపీ, యాంటీ బీజేపీ తప్ప మరో కూటమికి అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీని ఓడించాలన్నారు. మోడీ మళ్లీ ప్రధానైతే ఆంధ్రప్రదేశ్‌కు ఏమీ ఇవ్వరని అన్నారు. ఏపీలో జగన్‌కు ఓటేస్తే పరోక్షంగా మోడీకి వేసినట్టేనని జయదేవ్ అన్నారు.