700 పైగా కార్లు, 4 వేల కోట్ల ప్యాలెస్‌.. ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబం ఎవరిదంటే..?!

ఇంటర్నెట్‌డెస్క్‌ : నాలుగువేల డెబ్బై ఎనిమిదివేల (4,078) కోట్ల రూపాయల అధ్యక్ష భవనం, 700 కార్లు, 8 విమానాలు కలిగి ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబంగా పేరుగాంచింది. ఇంతకీ ఆ కుటుంబం ఎవరిదో తెలుసుకోవాలనుందా? వివరాల్లోకి వెళితే.. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యుఎఇ) దేశాద్యక్షుడు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ కుటుంబమే ప్రపంచంలోనే ధనిక కుటుంబంగా రికార్డుకెక్కింది. నహ్యాన్‌ని మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ (ఎంబిజెడ్‌) అని పిలుస్తారు. ఈయనకు 9 మంది పిల్లలు… 18 మంది మనవలు, మనవరాళ్లు ఉన్నారు. అలాగే ఈయనకు 18 మంది సోదరులు, 11 మంది సోదరీమణులు ఉన్నారు. మొత్తం కుటుంబాన్ని ఈయనే నిర్వహిస్తాడు. ప్రపంచంలోని చమురు నిల్వల్లో దాదాపు ఆరుశాతం ఆ కుటుంబం ఆధీనంలోనే ఉన్నాయి. మాంచెస్టర్‌ సిటీ ఫుట్‌బాల్‌ క్లబ్‌, ప్రముఖ గాయకుడు రిహన్న యొక్క బ్యూటీ బ్రాండ్‌ ఫెంటీ నుండి ఎలన్‌మస్క్‌ కంపెనీలతోపాటు, అనేక ప్రసిద్ధ కంపెనీల్లో కూడా ఈ కుటుంబం వాటాలను కలిగి ఉంది. ఇక యుఎఇ అధ్యక్షుడు తమ్ముడైన షేక్‌ హమద్‌ బిన్‌ హమ్దాన్‌ అల్‌ నహ్యాన్‌ వద్ద ఐదు బుగట్టి వేరాన్‌లు, లంబోర్గిని రెవెన్షన్‌, ఒక మెర్సిడెస్‌- బెంజ్‌ సిఎల్‌కె జిటిఆర్‌, ఫెరారి, Mc12 ఆర్‌ఎన్‌తోపాటు ప్రపంచంలోనే అతిపెద్ద ఎస్‌యువితోపాటు 700కి పైగా కార్లు ఉన్నాయి. ఈ కుటుంబం అబుదాబిలోని పూతపూసిన క్రస్‌ అల్‌-వతన్‌ అధ్యక్ష భవనంలో నివసిస్తుంది. యుఎఇలో అన్నిటికంటే ఇదే అతిపెద్ద ప్యాలెస్‌. ఈ భవనం దాదాపు 94 ఎకరాల విస్తీర్ణంలో.. చారిత్రాత్మక కళాఖండాలతో ఆకట్టుకునేవిధంగా ఉంటుంది. ఎంబిజెడ్‌ మరో సోదరుడు తహ్నౌన్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యానే నడుపుతున్న కంపెనీ విలువ 235 బిలియన్‌ డాలర్లు. వ్యవసాయం, విద్యుత్‌, వినోదం, సముద్ర వ్యాపారాలతోపాటు ఈ కుటుంబం నిర్వహిస్తున్న పలు వ్యాపారాల వల్ల దాదాపు పదివేల మంది ఉపాధి పొందుతున్నారు. యుఎఇ కాకుండా దుబారు, పారిస్‌, లండన్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఈ కుటుంబానికి ఎన్నో విలువైన ఆస్తులున్నాయి. అందుకే ఈ కుటుంబాన్ని బ్రిటీష్‌ రాజ కుటుంబంతో పోల్చుతారు. 2008లో ఎంబిజెడ్‌ యొక్క అబుదాబి యునైటెడ్‌ గ్రూప్‌.. లండన్‌ ఫుట్‌బాల్‌ జట్టులను మంచెస్టర్‌ సిటీ రూ.2,122 కోట్లకు కొనుగోలు చేసింది. మాంచెస్టర్‌ సిటీ, ముంబై సిటీ, మెల్‌బోర్న్‌ సిటీ, న్యూయార్క్‌ సిటీ ఫుట్‌బాల్‌ క్లబ్‌లను నిర్వహిస్తున్న మాంచెస్టర్‌ సిటీ ఫుట్‌బాల్‌ గ్రూప్‌లో 81 శాతం ఈ కుటుం వాటాను కలిగి ఉంది.

➡️