సంక్రాంతికి 6,795 ప్రత్యేక బస్సులు-సాధారణ చార్జీలతోనే ఆర్‌టిసి ప్రయాణం

Jan 6,2024 11:18 #APSRTC, #sankranthi, #special busses

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: రానున్న సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో వుంచుకొని ప్రయాణీకుల కోసం ఎపిఎస్‌ ఆర్‌టిసి మొత్తం 6,795 ప్రత్యేక బస్సులను నడుపనుంది. స్పెషల్‌ బస్సులలో ఎలాంటి అధనపు చార్జీలను వసూలు చేయకుండా సాధారణ చార్జీలతోనే నడపాలని నిర్ణయించారు. సంక్రాంతికి ముందురోజులో హైదరాబాద్‌కు 1,600 బస్సులు, బెంగుళూరుకు 250, చెన్నరుకు 40, విజయవాడకు 400, విశాఖపట్నానికి 290, రాజమండ్రికి 230, తిరుపతికి 70 బస్సులను వేశారు. అలాగే పండుగ తర్వాత 3,225 బస్సులను నడిపేందుకు ఆర్‌టిసి కార్యచరణ రూపొందించుకున్నట్లు ఎపిఎస్‌ ఆర్‌టిసి ఒక ప్రకటన విడుదల చేసింది.

➡️