6,478మందికి ఆశ్రయం : కలెక్టర్‌

Dec 6,2023 21:25
6,478మందికి ఆశ్రయం : కలెక్టర్‌

6,478మందికి ఆశ్రయం : కలెక్టర్‌ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో తిరుపతి జిల్లాలో మిచౌంగ్‌ తుపాను సందర్భంగా 84 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 6,478 మందికి ఆశ్రయం కల్పించినట్లు కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డి తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సహాయ చర్యలు చేపట్టామన్నారు. బుధవారం ముఖ్యమంత్రి తుపాను ప్రభావిత ఎనిమిది జిల్లాలైన తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల కలెక్టర్లతో, ఎస్‌పిలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టరేట్‌ నుంచి జిల్లా ప్రత్యేక అధికారి శ్యామలరావు, కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డి, ఎస్‌పి పరమేశ్వరరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వివరిస్తూ తిరుపతి జిల్లాలో తుపాను ప్రభావం 29 మండలాల్లో, 546 గ్రామాలపై పడిందని, 84 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 6478 మందికి ఆశ్రయం కల్పించి వారికి టిఫిన్‌, భోజనం ఏర్పాట్లు చేశామన్నారు. ఇళ్లకు వెళ్లే సమయంలో ఒకరికి వెయ్యి, కుటుంబానికి 2,500 రూపాయల చొప్పున అందించేందుకు సంబంధిత ఆర్డీవోలకు నిధులు విడుదల చేశామన్నారు.22,635 మంది కుటుంబాలకు 25 కేజీల బియ్యం, లీటర్‌ వంటనూనె, కందిపప్పు, ఉల్లి, బంగాళాదుంపలు కేజీ వంతున అందిస్తున్నామన్నారు. గాలుల నేపథ్యంలో 496 గ్రామాలకు విద్యుత్‌ అంతరాయం ఏర్పడిందని, బుధవారం సాయంత్రానికి ఐదారు గ్రామాలు మినహా పూర్తిగా పునరుద్ధరిస్తామన్నారు. వాకాడు రహదారిలో రవాణా మార్గం ఇబ్బంది వల్ల ఆలస్యం అవుతోందని వివరించారు.తాగునీటికి ఇబ్బందులు లేకుండా బోర్ల వద్ద జనరేటర్లు, ట్యాంకర్లు ఏర్పాటు చేశామన్నారు. ఆర్‌ అండ్‌ బికి సంబంధించి 97 కిలోమీటర్లు, పంచాయతీరాజ్‌ సంబంధించి 87 కిలోమీటర్లు దెబ్బతిన్నాయని, ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులు చేపట్టామన్నారు. విత్తు వేసి నెలరోజులు మాత్రమే అయిన వరి పంట 7126 హెక్టార్లు, హార్టికల్చర్‌ కు సంబందించి మిరప, పూల తోటలు సుమారు 246 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందన్నారు. పిచ్చాటూరు వద్ద ఆక్వా ఫామ్‌ దెబ్బతిన్నదని, పలు పశువులు, దూడలు, గొర్రెలు, మేకలు చనిపోయాయని, కాటిల్‌ షెడ్స్‌ దెబ్బ తిన్నాయని వివరించారు. ఈ కాన్ఫెరెన్స్‌ లో డిఆర్‌ఓ పెంచల కిషోర్‌, స్పెషల్‌ డిప్యూటి కలెక్టర్‌ లీగల్‌ సెల్‌ శ్రీనివాస రావు పాల్గొన్నారు. యుద్ధప్రాతిపదికన విద్యుత్‌ పునరుద్ధరణ తిరుపతి బ్యూరో : నెల్లూరు జిల్లాలో అతలాకుతలమైన విద్యుత్‌ వ్యవస్థను పునరుద్ధరించేందుకు అధికారులు, సిబ్బంది నిర్విరామంగా కృషి చేస్తున్నారని ఎస్‌పిడిసిఎల్‌ ఛైర్మన్‌ కె.సంతోష్‌రావు చెప్పారు. రెండు రోజులుగా నెల్లూరు జిల్లాలోనే ఉంటూ సూచనలిస్తున్నారు. కర్నూలు, అనంతపురం, కడప సర్కిళ్ల నుంచి అధికారులను, సిబ్బందిని రప్పించి పనిచేయిస్తున్నామన్నారు. వరద ఉధృతి ఉన్న ప్రాంతాల్లో ఆటంకం కలుగుతోందన్నారు. దగ్గరుండి విద్యుత్‌ పునరుద్ధరణ పనుల్లో సిఎండి

➡️