Apple: జీలో 15% ఉద్యోగులపై వేటు

Apr 5,2024 11:31

బెంగళూరు : పొదుపు చర్యల్లో భాగంగా జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (జడ్‌ఇఇఎల్‌) వరుసగా ఉద్యోగులపై వేటు వేస్తోంది. ఇటీవల బెంగళూరు టెక్‌ సెంటర్‌లో పని చేసే సిబ్బందిలో 50 శాతం మందిపై వేటుకు నిర్ణయం తీసుకోగా.. తాజాగా సంస్థలో పని చేసే మొత్తం ఉద్యోగుల్లో 15 శాతం మందిని ఇంటికి పంపించాలని నిర్ణయించింది. ఇదే విషయమై గురువారం ఆ కంపెనీ బిఎస్‌ఇ ఫైలింగ్‌లో తెలిపింది. సిబ్బంది తొలగింపు ప్రక్రియను జీ ఎండి, సిఇఒ పునీత్‌ గోయాంక బోర్డులో ప్రతిపాదించారు. ఈ ప్రక్రియ కసరత్తును ఆయన వివరించారు. సాధ్యమైనంత వరకు మానవ వనరుల తగ్గించుకుని పొదుపునపై దృష్టి సారించాలనే ఉద్దేశ్యంతో ఆ కంపెనీ ఉంది.

ఆపిల్‌లోనూ 600 మంది ఇంటికి..
కాలిఫోర్నియా : ప్రముఖ టెక్‌ దిగ్గజం ఆపిల్‌ భారీగా ఉద్యోగులపై వేటు వేసింది. స్మార్ట్‌కారు, డిస్‌ప్లే ప్రాజెక్టుల రద్దు చేస్తున్న నేపథ్యంలో 600 మంది ఉద్యోగులను తొలగించింది. స్మార్ట్‌ కారు, స్మార్ట్‌వాచ్‌ డిస్‌ప్లే ప్రాజెక్టులను పక్కన పెట్టడంతో ఉద్వాసనలకు పాల్పడింది.

➡️