5,546 మందికి ఇబిసి నేస్తం

Mar 14,2024 22:03

 ప్రజాశక్తి-విజయనగరం : జిల్లాలో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన 5,546 మందికి మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన రెడ్డి గురువారం రూ.831.90 లక్షలను విడుదల చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లె లో జరిగిన ఈ కార్యక్రమంలో, ముఖ్యమంత్రి జగన్‌ మోహన రెడ్డి బటన్‌ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేశారు. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసిన అనంతరం కలెక్టర్‌ నాగలక్ష్మి లబ్ధిదారులకు ఈ మొత్తానికి సంభందించిన చెక్కును అందజేశారు. రెడ్డి, కమ్మ, క్షత్రియ, బ్రాహ్మణ, వెలమ ఇతర ఒసి కులాలకు చెందిన 45-60 సంవత్సరాల పేద మహిళల ఆర్థికాభివృద్ధికి, సాధికారతకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఏటా రూ.15 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. దీనికింద 2021-22 సంవత్సరంలో 4,972 మందికి రూ.745.80 లక్షలు, 2022-23 లో 5,738 మందికి రూ.860.70 లక్షలు అందజేశారు. ఈ ఏడాదికి గాను 5,546 మందికి రూ.831.90 లక్షలను విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మితో బాటు, జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం ఇడి పెంటోజిరావు, రెడ్డిక కార్పొరేషన్‌ డైరెక్టర్‌ భాస్కరరావు, కార్పొరేషన్‌ అధికారులు, సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.

➡️