‘మిచౌంగ్ ఎఫెక్ట్ ’ .. వెయ్యికిపైగా విమానాలు రద్దు

న్యూఢిల్లీ /చెన్నై :  మిచౌంగ్  ఎఫెక్ట్‌తో  చెన్నైలో సుమారు వెయ్యికి పైగా విమానాలు రద్దయ్యాయి. మంగళవారం 60 విమానాలను రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. అలాగే మరో 15 విమానాలు 10ఎ-320/321 మరియు ఐదు ఎటిఆర్‌ -చెన్నైలో పార్క్‌ చేసినట్లు అధికారులు తెలిపారు.

సోమవారం నుండి కురుస్తున్న భారీ వర్షాలతో చెన్నై రన్‌వేపై భారీగా వరదనీరు చేరింది. దీంతో విమానాశ్రయంలో కార్యకలాపాలను నిలిపివేశారు. సోమవారం ఇండిగో 550 విమానాలను రద్దు చేయగా, విస్తారా చెన్నై నుండి వెళ్లే పది విమానాలను రద్దు చేసింది. మిచౌంగ్‌ తుఫానుతో ఆదివారం రాత్రి నుండి చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో వరదనీరు చేరింది. రైళ్లు, విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు.

తుఫాను మరికాసేపటిలో ఆంధ్రప్రదేశ్‌ తీరాన్ని తాకనుందని వాతావరణ శాఖ అంచనావేసింది.

➡️