539 మందికి రూ.4.98 కోట్ల లబ్ధి

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గురువారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుండి వై.యస్‌.ఆర్‌ కళ్యాణమస్తు మరియు వై.యస్‌.ఆర్‌ షాదీ తోఫా పధకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 10,511 మంది మహిళల తల్లుల ఖాతాలో నేరుగా డి.బి.టి పద్దతిలో రూ.81.64 కోట్లను జమ చేసే కార్యక్రమాన్ని కంప్యూటర్‌ మీట నొక్కి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా గ్రామీణ అభివృధి సంస్థ ఆద్వర్యములో జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి, జిల్లా పరిషత్‌ ఛైర్పర్సన్‌ హెనీ క్రిస్టినాతో కలసి స్థానిక నరసరావుపేట కలెక్టర్‌ కార్యాలయంలోని యస్‌.ఆర్‌. శంకరన్‌ వీడియో కాన్ఫరెన్సు హాల్‌లో వీక్షించారు. పల్నాడు జిల్లాలో షెడ్యూల్‌ కులాలకు సంబంధించి 249 మంది లబ్ధిదారులకు రూ.2.49 కోట్లు, కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీలకు సంబంధించి 8 మందికి రూ.9.60 లక్షలు, ముగ్గురు వికలాంగులకు రూ.4.50 లక్షలు, ఎస్టీలకు సంబంధించి 58 మందికి రూ.58 లక్షలు, కులాంతర వివాహం చేసుకున్న షెడ్యూల్‌ తెగలకు 6 మందికి రూ.7.20 లక్షలు, వెనుకబడిన తరగతులకు చెందిన 9 మందికి రూ.4.50 లక్షలు, కులాంతర వివాహం చేసుకొన్న వెనుకబడిన తరగతుల వారికి సంబంధించి 148 మందికి రూ.1.11 కోట్లు, మైనారిటీలకు 52 మందికి రూ.52 లక్షలు, భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి ఆరుగురికి రూ.40, మొత్తంగా 539 మందికి రూ.4.98 కోట్లు లబ్ది చేకూరిందన్నారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, డి.ఆర్‌.డి.ఎ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ బాలూ నాయక్‌, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఓబుల నాయుడు, డి.టి.డబ్ల్యూ. వరలక్ష్మి, లబ్దిదారులు పాల్గొన్నారు.

➡️