పోరుబాటలో ఆటపాటలు..

21వ సంఖ్య అకారంలో తెనాలిలో అంగన్వాడీలు
ప్రజాశక్తి-తెనాలిరూరల్‌ :
అంగన్వాడీలు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె సోమవారానికి 21వ రోజుకు చేరుకుంది. స్థానిక విఎస్‌ఆర్‌ కళాశాల ఎదురుగా నిర్వహిస్తున్న సమ్మె శిబిరాన్ని సిఐటియు, సిపిఎం నాయకులు సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు సమ్మె చేపట్టి 21 రోజులైనందుకు గాను 21 సంఖ్యల రూపంలో కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు ఎవిఎన్‌ కుమారి మాట్లాడుతూ 21 రోజులు పాటు రోడ్లెక్కి నిరసన తెలుపుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్లుగా కూడా లేదని వాపోయారు. పండగల్లో కూడా స్త్రీలు రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగిస్తామని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అంగన్వాడీలపై చేస్తున్న వ్యాఖ్యలు జగన్మోహన్‌ రెడ్డికి చేరుతున్నాయో లేదోఅని సందేహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిఐటియు, సిపిఎం నాయకులు కె.బాబు ప్రసాద్‌, షేక్‌ హుస్సేన్‌వలి, పి.పావని, ఎలిజిబెత్‌, రంగపుష్ప, విజయలక్ష్మి, అనురాధ, హసీనా బేగం పాల్గొన్నారు.
ప్రజాశక్తి – మంగళగిరి : స్థానిక అంబేద్కర్‌ సెంటర్లో ఏర్పాటు చేసిన సమ్మె శిబిరంలో అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎస్‌ఎస్‌ చెంగయ్య, ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.బాలకృష్ణ, అంగన్వాడి యూనియన్‌ నాయకులు వినీల, రుక్మిణి, పి.ఫాతిమా, భూలక్ష్మి, సుహాసిని పాల్గొన్నారు.
ప్రజాశక్తి – చేబ్రోలు : స్థానిక సమ్మె శిబిరంలో అంగన్వాడీలు ఆటపాటలతో తమ నిరసన తెలిపారు. ఈ సంద్భంగా సిఐటియు గుంటూరు జిల్లా అధ్యక్షులు డి.లకీëనారాయణ మాట్లాడుతూ కొత్త సంవత్సరాన్ని కూడా ఆందోళన మధ్య జరుపుకోవడం చాలా బాధాకరంగా ఉందన్నారు. కొత్త సంవత్సరంలో కూడా పస్తులుంచారని, జగన్మోహన్‌రెడ్డికి అంగన్వాడీల కష్టాలు పట్టవా అని ప్రశ్నించారు. జనవరి మూడో తేదీ కలెక్టర్‌ కార్యాలయం వద్ద జరిగే ధర్నాకు అంగన్వాడీలు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం యూనియన్‌ మండల అధ్యక్ష కార్యదర్శులు రత్న మంజుల, అనురాధ ఆధ్వర్యంలో ఆటపాట నిర్వహించారు. సుమలత, మరియరాణి, లక్ష్మీ తిరుపతమ్మ, మౌనిక పాల్గొన్నారు.
ప్రజాశక్తి-కొల్లిపర : స్థానిక కచేరి వద్ద ఏర్పాటుచేసిన శిబిరంలో అంగన్వాడీలు క్రికెట్‌, కోలాటం ఆడి తమ నిరసనను తెలిపారు. యూనియన్‌ మండల అధ్యక్షురాలు నిర్మల జ్యోతి మాట్లాడుతూ ప్రభుత్వం సత్వరమే స్పందించలని, తమకు కనీస వేతనం గ్రాడ్యుటి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అప్పటి వరకూ సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వి.ఇమాని, శివపార్వతి, పుష్పలత, శ్రీలక్ష్మి, పూర్ణకుమారి పాల్గొన్నారు.
ప్రజాశక్తి – ఫిరంగిపురం : మండల కేంద్రమైన సమ్మె శిబిరంలో అంగన్వాడీలు నిరసన కొనసాగించారు. చెడు వినవద్దు, చెడు కనవద్దు, చూడు మాట్లాడకు.. అనే సంకేతాలతో కొందరు చెవులు మూసుకోగా మరికొందరు కళ్లు, నోళ్లు మూసుకుని శిబిరంలో కూర్చున్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా నిరసన తెలిపారు. యూనియన్‌ మండల అధ్యక్షులు పి.రజిని మాట్లాడారు. పద్మ, మంజుల, సీతారాఘవ, నందిని, సామ్రాజ్యం అనురాధ పాల్గొన్నారు.
ప్రజాశక్తి – తుళ్లూరు : రాజధాని ప్రాంతం తుళ్లూరులో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు సోమవారం ఆటా – పాటలతో నిరసన తెలిపారు. స్థానిక బి ఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద సమ్మె శిబిరం ముందు కొద్దిసేపు కబడ్డి ఆడారు. పాటలతో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎలుగెత్తి చాటారు. సిఐటియు రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం.భాగ్యరాజు మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అయితే అందుకు భిన్నంగా ప్రత్యామ్నాయ మార్గాలంటూ బెదిరింపు ధోరణి అవలంభించడం సరైంది కాదని అన్నారు. కార్యక్రమంలో ఏపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ అధ్యక్ష,కార్యదర్శులు స్వర్ణలత, కరిమూన్‌, రజనీ, అన్నామణి పాల్గొన్నారు.
ప్రజాశక్తి – తాడికొండ : నియోజకవర్గ కేంద్రమైన తాడికొండలో అంగన్వాడీల సమ్మె శిబిరం కొనసాగుతోంది. సిఐటియు నాయకులు వై.గాంధీ రాంమోహన రావు, రైతు సంఘం నాయకులు చింతల భాస్కరరావు మద్దతు తెలిపారు. యూనియన్‌ మండల అధక్షులు వెంకటలకీë, సుబ్బాయమ్మ, నాయకులు సరళ, జ్యోతి, కుమారి పాల్గొన్నారు.
ప్రజాశక్తి-పెదనందిపాడు రూరల్‌ పెదనందిపాడు, కాకుమాను మండల కేంద్రాల్లో అంగన్వాడీల సమ్మె శిబిరాలు కొనసాగుతున్నాయి. ఆటపాటలతో తమ నిరసనలు తెలిపారు.

➡️