మోత మోగించు హక్కులు సాధించు మైదుకూరు : పండగలకు, జన్మదినానికి జిల్లాకు గాలో వస్తున్నాడు.. గాల్లో వెళ్తున్నాడు కానీ అంగన్వాడీల సమస్యలు తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి సమయం లేదని సిటైఇయు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్‌ అన్నారు. మంగళవారం మైదుకూరు పట్టణంలో అంగన్వాడీ నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెలో ఆయన మద్దతు పలికారు. కార్యక్రమంలో ఎఐటియుసి నాయకులు నాగ సుబ్బారెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్‌ కుమార్‌, డివైఎఫ్‌ఐ నరసింహ, సిఐటియు నాయకులు జాహింగీర్‌ బాష, షరీఫ్‌, సిపిఐ నాయకులు శ్రీరాములు, ఎఐటియుసి నాయకులు శివరామ్‌, అంగన్వాడీ కార్యకర్తలు భారతి, ధనలక్ష్మి, చేన్నమ్మ శోభ, రామ తులసి, రిజ్వాన పాల్గొన్నారు. ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌) : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ప్లేట్లు వాయిస్తూ అంగన్వాడీలు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీ యూనియన్‌ జిల్లా కార్యదర్శి బి.లక్ష్మీదేవి మాట్లాడుతూ అంగన్వాడీలకు నాసిరకం ఫుడ్డు ప్రభుత్వం అందిస్తున్న నేపథ్యంలో నాణ్యమైన పౌష్టిక ఆహారంతో పాటు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు జీతాలు పెంపుదల చేసి వారి నాణ్యమైన డిమాండ్లను నెరవేర్చ లన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, ఐద్వా జిల్లా కార్యదర్శి ముంతాజ్‌ బేగం, అంగన్వాడీ యూనియన్‌ కార్యదర్శి సుబ్బలక్ష్మి, సునీత, నాగలక్ష్మి, ఎఐటియుసి కార్యదర్శి విజయ గురుదేవి, శివమ్మ, అర్బన్‌ సెంటర్ల అంగన్వాడి వర్కర్లు దాదాపుగా 500 మంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కడప అర్బన్‌ : మంగళవారం రూరల్‌, అర్బన్‌ ప్రాజెక్ట్‌ ఎదుట ప్లేటు,గరిటతో మోత మోగిస్తూ నిరసన చేపట్టారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ నాయకులు ఓబులేసు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు నాగలక్ష్మి, పద్మ, సంటెమ్మ, స్వర్ణ, కష్ణవేణి పాల్గొన్నారు. పులివెందుల టౌన్‌ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అంగనవాడీ కార్యకర్తలు, ఆయాలు డిమాండ్‌ చేశారు. మంగళవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఆవరణలో అంగన్వాడీల ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన హక్కులను వెంటనే పరిష్కరించాలని కోరారు కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ లను వెంటనే అమలు చేయాలని టిడిపి శాసనమండలి సభ్యుడు భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం స్థానిక తాసిల్దార్‌ కార్యాలయం ఆవరణలో అంగన్వాడీల ధర్నా నిర్వహిస్తున్న ధర్నాకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన హక్కులను వెంటనే పరిష్కరించాలని కోరారు. మీరికి ఒక మద్దతుగా అంగన్వాడీ కుటుంబ సభ్యులు కూడా కూర్చొన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు మధుసూదన్‌ రెడ్డి, ప్రాజెక్ట్‌ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. వేంపల్లె : అంగన్వాడీ ఉద్యోగులకు జీతాలు పెంచాలంటూ ప్లేట్లు వాయిస్తూ విన్నూతంగా సమ్మె చేశారు. అంగన్వాడీలకు జీతాలు పెంచడంతో సమస్యలను పరిష్కరించాలని చేస్తున్న సమ్మె మంగళవారం 15వ రోజుకి చేరుకొంది. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద గెంటాలతో ప్లేట్లుకు కొట్టుతూ విన్నూతంగా శబ్ధం చేస్తూ నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు సరస్వతి, లలితా, సావిత్రి, శైలజా, వేంపల్లె, వేముల, చక్రాయపేట మండలాల అంగన్వాడీ మహిళాలు, ఆయాలు పాల్గొన్నారు. చాపాడు : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణలో మంగళవారం అంగన్వాడీలు వినూత్నంగా నిరసన తెలియజేశారు. పేట్లు వాయిస్తూ సమ్మె కొనసాగించారు. కార్యక్రమంలో కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. బద్వేలు : అంగన్వాడీ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె 15వ రోజుకు చేరుకుంది. సిడిపిఒ కార్యాలయం నుంచి గరిటలతో పేట్లు వాయిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుంచి పోస్టాఫీసు, అంబేద్కర్‌ సర్కిల్‌, ఆర్టీసీ బస్టాండ్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి.అన్వేష్‌ సిఐటియు జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాసులు, సిఐటియు జిల్లా కార్యదర్శి కె. నాగేంద్రబాబు సిఐటియు పట్టణ కో-కన్వీనర్‌ పి.సి. కొండయ్య సిఐటియు నాయకులు రాజగోపాల్‌, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పి. కదిరయ్య, డివైఎఫ్‌ఐ నాయకులు, అదిల్‌, సురేంద్ర, ఇమాన్యుల్‌ , ఐద్వా,సంఘం నాయకురాలు అనంతమ్మ, గౌతమి, నాగమ్మ, అంగన్వాడీ ప్రాజెక్ట్‌ నాయకురాలు సుభాషిని, ఉషానమ్మ, విజయమ్మ, శోభా దేవి, సుభద్ర, జయప్రదమ్మ, రాధమ్మ, రత్నమ్మ, తులసమ్మ, కళావతి, కె.వి సుభాషిని, వాణి, వసంత, జమ్మలమడుగు : అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంతవరకు సమ్మె ఆగదని జిల్లా సిఐటియు కార్యదర్శి బి లక్ష్మీదేవి, ప్రొద్దుటూరు సిఐటియు కార్యదర్శి సత్యం పేర్కొన్నారు. మంగళవారం జమ్మలమడుగు పట్టణంలోని ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అంగన్వాడి మహిళలందరూ ప్లేట్లను తీసుకుని గంటలతో ప్లేట్లను కొడుతూ వినూత్నంగా నిరసన చేపట్టారు. అంగన్వాడీలకు మద్దతుగా యుటిఎఫ్‌ సంఘం నాయకులు, ఎపిటిఎఫ్‌ సంఘ నాయకులు, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ సంఘ నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి ఏసుదాసు, సిఐటియు పట్టణ కార్యదర్శి దాసరి విజరు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు భాగ్యమ్మ లక్ష్మీదేవి నరసమ్మ పాల్గొన్నారు. దువ్వూరు : అంగన్వాడీ వర్కర్ల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించే వరకు సమ్మెను కొనసాగిస్తామని అంగన్వాడీ సిబ్బంది తెలిపారు అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 15 రోజులు చేరుకుంది. రోజూ వినూత్న పద్ధతుల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఈరోజు ఎంపిడిఒ కార్యాలయం ఎదుట కాళీ కంచాలతో గంటలతో చప్పుడు చేసుకుంటూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలు నెరవేరేవరకు సమ్మె విరమించబోమని అంగన్వాడీలు చెప్పారు. పోరుమామిళ్ల : తహశీల్దార్‌ కార్యాలయం నుంచి ఆర్‌టిసి బస్టాండ్‌ వరకు పల్లెం, గరిటలతో మోత మోగించుకుంటూ జీతాలు పెంచాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు ర్యాలీ నిర్వహించారు. ఆర్‌టిసి బస్టాండ్‌లో మానవహారంగా నిలబడి పెద్ద ఎత్తున శబ్దం మోగించి నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్‌. బైరవప్రసాద్‌, ఓబులాపురం, విజయమ్మ, సిఐటియు మండల నాయకులు బోజ్జా చిన్నయ్య, ప్రాజెక్టు అధ్యక్షులు వినోదదేవి, అంగన్వాడీ దస్తగిరమ్మ, రేణుకాదేవి, జ్యోతి, సుధా, వాణి, లీలావతి, నాయణమ్మ, స్వాతి, రమాదేవి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

➡️