- గౌతమ్ నవ్లఖ్
భారతదేశ రక్షణ వ్యవస్థకు సంబంధించి, కీలక విభాగాలైన డిజైన్, అభివృద్ధి మరియు ఉత్పత్తికి చెందిన కొన్ని ముఖ్యమైన రంగాల ను సమర్ధవంతమైన ప్రైవేటు సంస్థలకు అప్పగిం చాలన్న సత్యం వాస్తవానికి అత్యంత కఠినమైనది.
పద్నాలుగు నెలల సుదీర్ఘ ఆలశ్యం తర్వాత కేంద్ర మంత్రివర్గ కమిటీ రక్షణ వ్యవస్థకు సంబంధించి ఓ ముఖ్యమైన ఫైలుపై తను అంగీకారాన్ని తెలిపింది. అది ''భారతీయ రక్షణ వ్యవస్థకు సంబంధించి, మిలటరీకి అవసరమైన రక్షణాయుధాల తయారీకి కొన్ని పాశ్చాత్య కంపెనీలతో వ్యూహాత్మకంగా కలసి పని చేయ డం''. వాస్తవానికి ఇది కొత్త విషయం కాదు... గతంలో దేశాన్నేలిన ''కాంగ్రెస్'' హయాంలో ''రక్ష ఉద్యోగ రత్న'' అన్న పేరుతో 12 ప్రైవేటు కంపెనీలకు, రక్షణవ్యవస్థకు కావాల్సిన కీలక పరికరాలకై ఆమోదం తెలిపింది. ప్రస్తుతమున్న భారతీయ జనతా పార్టీ సైతం, అదే మార్గాన్ని అనుసరిస్తూ, రెండు సంవత్సరాల క్రితమే '' స్ట్రాటజిక్ ప్రైవేట్ పార్టనర్స్ (యస్పిపి) అంటూ ముందు కొచ్చింది. 2016వ సంవత్సరం మార్చి 28న 'గోవా' లో ప్రకటించిన 'డిఫెన్స్ ప్రొక్యూర్ మెంట్ పాలసీ (డిపిపి)లో యస్పిపి లోని 7వ అధ్యాయాన్ని మినహాయించి ప్రకటించటం దీనికి కారణం, ప్రభుత్వం ఎంపికచేసిన ప్రైవేటు కార్పొరేట్ సంస్థల మధ్యనున్న వ్యాపారాత్మక వైరుధ్యాలు నరేంద్రమోడి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం, ముక్కలు ముక్కలుగా వ్యవస్థను చీలుస్తున్న విధానం కూడా దీనికి మూలమే, గోప్యత అంటూ వ్యవహరిస్తూ కొన్ని కీలకాంశా లను ప్రస్తుటంగా ప్రకటించకపోవడం కూడా మరో కారణం. భాగస్వామ్యం వహిస్తున్న సంస్థల, సంపూర్ణ వివరాలను, గోప్యత పేరుతో ప్రకటించక పోవడం, నిర్ణీత సమయంలో అం దించాల్సిన సామాగ్రి అందించడంలో విఫలమై నట్లయితే, ఎటు వంటి జరిమానా సంబంధిత సంస్థలకు వేయడం జరుగుతుందో తెలియకుండా గోప్యంగా ఉంచడం కూడా కారణాలే!
సబ్మెరైన్లు, ఫైటర్ జెట్లు హెలి కాప్టర్లు మరియు యుద్ధ క్షిపణులను కలిగిఉండే వాహనాలు, ట్యాంకర్లు, ఈ నాలుగు రంగా లలో ''వ్యూహాత్మక భాగస్వాములను'' ఎంపిక చేయడం జరిగింది. డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ (డిపియస్యు)లను, ఫైటర్ జెట్స్, హెలికాఫ్టర్లకు కనీసం బిడ్డింగ్ కూడా వేయకుండా రక్షణశాఖ నిరోధించింది. అంతేగాక సబ్ మెరైన్లకు, యుద్ధ ట్యాంకుల వాహనాలకైనా సిద్ధాంత పరమైన వ్యతిరేకతతో బిడ్డింగ్‌కు అనుమతిస్తారా? లేక అనుమతించరా అన్నది కూడా గమనించాల్సిన విషయమే! ప్రతి విభా గంలోనూ ఆరుగురు వ్యూహాత్మక భాగస్వా ములుగా దరఖాస్తూ చేయవచ్చు.... వారి నుండే ఒక్కరిని ఎంపిక చేయడం జరుగుతుంది అదే విధంగా ఒక్కో విభాగంలోనూ రెండు లేదా మూడు కంపెనీలను ''ఒరిజనల్ ఎక్విప్మెంట్ మాన్యుపాక్చరర్స్ (ఓఇయంయస్), అనగా సహజమైన సాయుధ సామాగ్రి ఉత్పత్తి దారులు గా ఎంచడం జరుగుతుంది. ఈ విభాగాలలో పోటీ పడే సంస్థలకు స్వంత మౌలిక వసతులు, పాశ్చాత్య మేధావుల అనుభవజ్ఞత, వారి సేవల వినియోగంతో పాటుగా కనీసం 2000 కోట్ల రూపాయల స్వంత ఆస్థులు, గత మూడు ఆర్థిక సంవత్సరాలుగా కనీసం 4,000 కోట్ల వార్షిక టర్నోవర్ తగ్గకుండా ఉండాలన్న నిబంధనలు పాశ్చాత్య సంస్థలకు మాత్రమే ఉపయోగపడు తుంది. అవి అందించే సాంకేతికత పరంగా, వారి యొక్క పరిధి, విస్తృతి, లోతు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. దేశీయ సంస్థలు స్థానికంగా మౌలిక వసతులు కల్పించుకుని, విదేశీ సంస్థల భాగస్వామ్యంలో సాంకేతికను అందిపుచ్చుకొని, కావాల్సిన రీతిగా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. నిజానికీ దేశీయంగా మంచి నేపధ్యమున్న ''భారత్ ఫోర్జ్, లార్సన్ అండ్ టూబ్రో, టాటాపవర్, మహీంద్ర'' వంటి సంస్థలు మిలటరీకి రక్షణాయుధాల తయారీలో సహకరించిన నేపధ్యముంది. నైపుణ్యం పరంగా సైతం మంచి చరిత్ర ఉంది. కానీ మిలటరీ రక్షణ వ్యవస్థకు సంబంధించిన పరికరాల తయారీకి విషయంలో మాత్రం, బెహమాత్ కంపెనీ తో పోల్చినపుడు, కాస్త దిగువస్థాయిలోనే దేశీయ కంపెనీలున్నాయన్నది వాస్తవం.
కొత్తగా ప్రవేశిస్తున్న నూతన కంపెనీలను, దేశీయ కంపెనీలతో పోల్చినట్లయితే కొత్త వారిని రక్షణ రంగంలోకి అహ్వానించడం అంత శ్రేయ స్కరం కాదు. ప్రభుత్వం కేటాయించే భూములు, తక్కువ వడ్డీతో పెట్టుబడులు, ఖచ్చితంగా లభించే ప్రభుత్వ ఆర్డర్లు ఇవన్ని పరిగణనలోకి తీసుకున్న ట్లయితే కేవలం ''పరికరాలను కలిపి, ఉత్పత్తి చేయడానికే'' విదేశీ సంస్ధలు ఉపయోగ పడబోతు న్నాయా? కేంద్ర రక్షణమంత్రి నాయకత్వంలోని ''డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్'' చెప్పేదే మంటే, స్వీయ అపరాధాలను, రుణాల పునర్మిర్మాణము, నికర్ధక ఆస్థులపై తెచ్చే అప్పులు, మొదలయిన చరిత్రను పరిగణలోకి తీసుకొని వ్యూహాత్మక భాగస్వామిని ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపింది. ఉదాహరణకు ప్రభుత్వం ఎంపిక చేసిన పరిమిత కంపెనీల పట్టికలో ఉన్న ''అనిల్ ధీరూభారు అంబానీ కంపెనీ 1.25 లక్షల కోట్లు, అదానీ గ్రూప్ కంపెనీలు 96,031 కోట్ల రూపాయలు, పబ్లిక్, మరియు ప్రైవేట్ బ్యాంకు లకు బకాయిలున్నాయి. వీటిలో కొంతభాగం నిరర్థక ఆస్థులుగా మారాయి. మరి ఈ కంపెనీ లను ఎలా ఎంపిక చేశారు? పట్టికలో తొలి స్థానాలలో ఎలా కూర్చోపెట్టారు? ప్రభుత్వం నిర్దేశించిన పరిధులను అతిక్రమించి మరీ రక్షణ వ్యవస్థను ప్రైవేటుపరం చేయబోతుందని ఈ ఎంపిక ద్వారా స్పష్టమవుతున్నది. వాస్తవానికి 2017 ఫిబ్రవరిలో ప్రభుత్వం రఫాయెల్ సంస్థతో 29,000 కోట్లకు ఒప్పందంలో రిలయన్స్ సంస్థ ప్రధాన లబ్దిదారుగా ఉన్నది. రఫాయేల్ సంస్థతో కలిసి అమెరికాకు చెందిన సప్తమ నౌకాదళం మన యుద్ధ విమానాలను రిపేరు చేసే ఒప్పం దాలను చేసుకున్నది. ఈ సప్తమ నౌకాదళం 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో మనదేశాన్ని బెదిరించింది. ఇటువంటి చరిత్ర ఉన్న సంస్థతో 2016 ఆగస్టులో మోడీ ప్రభుత్వం ''మెమొరాండం ఆఫ్ అగ్రిమెంట్''ను ఎలా చేసుకున్నది? భారత ప్రభుత్వం, లాభదాయకమైన ఒప్పందాలను ఫ్రెంచ్ సంస్థలకు ఏ ప్రయోజనాల కోసం అందిస్తున్నది? అది కూడా అమెరికా నావికా దళానికి, రక్షణ విధానానికి అనుకూ లంగా ఉన్న సంస్థలతో ఏ విధంగా ఒప్పందం చేసుకుంటున్నది?
రక్షణ మంత్రిత్వశాఖ, డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ యూనిట్ల పాత్ర విషయంలోనూ, మిలటరీ అవసరాల కనుగుణంగా ఉత్పత్తులు చేయడంలోనూ, నత్తనడక నడుస్తున్నది. పబ్లిక్ సెక్టార్‌ని వృద్ధి చేయమని, ప్రైవేటు సంస్థలను ద్వితీయ స్థానంలో ఉంచమని సూచిస్తూ ''విజరు కేల్కర్'' కమిటీ 2005వ సంవత్సరంలో ఇచ్చిన నివేదికను, ముఖ్యగా రక్షణ వ్యవస్థకు సంబంధిం చి దేశీయ ఉత్పత్తులను ఉపయోగించ్మన్న సూచనలను బుట్ట దాఖలా చేసింది. తద్భిన్నంగా ప్రైవేటు రంగానికి పెద్ద పీటవేసి అగ్రస్థానాన కూర్చోబెట్టి పబ్లిక్ సెక్టార్‌ని ద్వితీయ స్థానానికి తోసేసింది.
- అనువాదం : డాక్టర్ శమంతకమణి