యెస్‌ బ్యాంక్‌ లాభాల్లో 350శాతం వృద్థి

Jan 27,2024 21:20 #Business

ముంబయి : ప్రయివేటు రంగంలోని యెస్‌ బ్యాంక్‌ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 349.7 శాతం వృద్థితో రూ.231.6 కోట్ల నికర లాభాలు సాధించింది. 2022ా23 ఇదే త్రైమాసికంలో రూ.51.5 కోట్ల లాభాలు నమోదు చేసింది. 2023 డిసెంబర్‌ ముగింపు నాటికి బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు యథాతథంగా 2 శాతంగా, నికర నిరర్థక ఆస్తులు మెరుగుపడి 0.9 శాతానికి తగ్గాయి. గడిచిన క్యూ3లో నికర వడ్డీపై ఆదాయం 2.3 శాతం పెరిగి రూ.2,016 కోట్లుగా నమోదయ్యింది.పిఎన్‌బి లాభాలు మూడు రెట్లుప్రభుత్వ రంగంలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పిఎన్‌బి) 2023ా24 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో మూడు రెట్ల వృద్థితో రూ.2,222.8 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.253.49 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో 9.76 శాతంగా ఉన్న బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు.. గడిచిన డిసెంబర్‌ ముగింపు నాటికి 6.24 శాతానికి తగ్గాయి. నికర నిరర్థక ఆస్తులు 3.30 శాతం నుంచి 0.96 శాతానికి పరిమితమయ్యాయి. పిఎన్‌బి నికర వడ్డీపై ఆదాయం 12.13 శాతం వృద్థితో రూ.10,293 కోట్లుగా చోటు చేసుకుంది. 2023 డిసెంబర్‌ 31 నాటికి భారత్‌లో 10,108 శాఖలు, 12,455 ఎటిఎం కేంద్రాలు, 29,768 బిజినెస్‌ కరస్పాండెంట్లను కలిగి ఉంది.

➡️