34,652 మందికి రూ.32.57 కోట్ల విద్యాదీవెన

Mar 1,2024 23:44

విద్యార్థులకు మెగా చెక్కును అందిస్తున్న పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శిశంకర్‌
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
వైఎస్‌ఆర్‌ విద్యాదీవెన త్రైమాసిక నగదును ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం కృష్ణా జిల్లా, పామర్రులో బహిరంగ సభ నుండి విడుదల చేశారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టరేట్‌ నుండి కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌, విద్యార్థులు వర్చువల్‌గా పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పల్నాడు జిల్లాకు సంబంధించి 34,652 మంది విద్యార్థినీ విద్యార్థులకు సంబందించి రూ.32.57 కోట్లు వారి తల్లుల ఖాతాల్లో జమైనట్లు తెలిపారు. వీరిలో ఎస్సీలు 7070 మందికి రూ 5.65 కోట్లు, ఎస్టీలు 2494 మందికి రూ.2.10 కోట్లు, బీసీలు 10814 మందికి రూ.9.79 కోట్లు, ఈబీసీలు 8468 మందికి రూ.9.50 కోట్లు, కాపులు 2616 మందికి రూ.2.46 కోట్లు, ముస్లిమ్‌ మైనార్టీలు 3229 మందికి రూ.2.96 కోట్లు, క్రిస్టియన్‌ మైనార్టీలు 109 మందికి రూ.11 లక్షలు లబ్ధి చేకూరినట్లు వివరించారు. ఈ మేరకు మెగా చెక్కును విద్యార్థులకు కలెక్టర్‌ అందించారు.

➡️