జనాకర్షణ లేకే పవన్ కళ్యాణ్ ని తెప్పించుకున్న చంద్రబాబు

Dec 21,2023 11:46 #Vizianagaram
ycp mla on yuvagalam meeting

రానున్న ఎన్నికల్లో వైసిపి గెలుపు ఖాయం
నియోజవర్గంలో జరిగిన అభివృద్ది పై బహిరంగ చర్చకు సిద్దం
డిప్యూటి స్పీకర్ కోలగట్ల
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నిన్న జరిగిన సభకు పవన్ కళ్యాణ్ రాను అంటే 14 ఏళ్లు సిఎం చేసిన వ్యక్తి బతిమాలుకొని సభకు తీసుకొచ్చిన దుస్తితి టిడిపి ధి అని డిప్యూటి స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు.గురువారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబుకు ఓటు అడిగే హక్కు కోల్పోవడం వల్ల జనాకర్షణ కలిగిన పవన్ కళ్యాణ్, బాలకృష్ణ నీ తీసుకొచ్చారన్నారు. నీదగ్గర అధికారం తీసుకుంటే ఆ వ్యక్తి సైకో అవుతాడా అని చంద్రబాబు నీ అడుగుతున్నన్నారు. గత నాలుగున్నర ఏళ్లలో 175 నియోజక వర్గంలో ఎప్పుడైనా సమస్యలపై ప్రశ్నించారా అని అన్నారు. ఉద్యోగ అవకాశాలు,రైతులకు,ప్రజలకు ఉపకారం చేస్తామంటున్నా మీరు 2014 లో ఇచ్చిన హామీ లు అమలు చేస్తే 2019 లో ఎందుకు మీరు ఓడిపోతారు ప్రశ్నించారు.రాష్ట్రంలో మాట తప్పని, మడం తిప్పని పాలన సాగుతుందన్నారు.
విద్యకి, వైద్యానికి పెద్ద పీట వేయడం జరిగిందన్నారు. 7 మెడికల్ కాలేజీలు,నాడు నేడుతో పెను మార్పులు వైసిపి ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది అని అన్నారు.
అధికార దాహంతో ఉన్న చంద్రబాబుకి చేసిన అభివృద్ది తెలియదని, ప్రజలకు తెలుసునని అన్నారు. బహిరంగ సభకు యావత్తు రాష్ట్రం నుంచి వస్తె గానీ సభ పెట్టలేని స్థితిలో టిడిపి ఉందన్నారు. 175 నియోజక వర్గాల లో పోటీ చేసే శక్తి లేక ఇతర పార్టీలు మీద ఆధారి పడి ఉన్నారన్నారు రానున్న ఎన్నికల్లో అడ్రస్ గల్లంతు ఖాయం అన్నారు. ఎర్రపుస్తకం చూపిస్తున్న లోకేష్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు కనిపించలేదు, ఇప్పుడు కనిపించారా అని లోకేష్ నీ ప్రశ్నించారు. ఇంటి ఇంటి వైద్యాన్ని ప్రవేశ పెట్టిన ఘనత జగన్మోహనరెడ్డి ది కాదా అని ప్రశ్నించారు. ఇటువంటి పాలన మీరు ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. ఎప్పుడు ఎన్నికల జరిగిన గెలిచే పరిస్తితి వైసిపికి ఉందన్నారు. అక్రమ డబ్బులు సంపాదించిన వారికి వైసిపి పాలన నచ్చలేదు,ప్రజా సంక్షేమ పథకాలు,ప్రజా పాలనకు ప్రజలు నుంచి ఆదరణ లభిస్తుందన్నారు. అవినీతి అక్రమాలు చేసిన మీకు నీతి నిజాయితీ తో నడుస్తున్న మా పార్టీకి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు. మా నియోజక వర్గంలో చేసిన అభివృద్ది పనులు పై బహిరంగ చర్చకు రాగలరా అని సవాల్ విసిరారు. చంద్ర బాబు పాలనను ప్రజల ఎవ్వరూ కోరుకోవడం లేదని అన్నారు.రానున్న ఎన్నికల్లో వైసిపి దే విజయం ఖాయమన్నారు.

➡️