అరేబియా సముద్రంలో 3,300 కేజీల డ్రగ్స్ సీజ్..

Feb 28,2024 12:05 #Drugs, #Gujarat, #Indian Navy, #sized

గుజరాత్ : అరేబియా సముద్రంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. భార‌తీయ నౌకాద‌ళం, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) మంగ‌ళ‌వారం నాడు ఈ భారీ ఆప‌రేష‌న్ చేపట్టింది. ఇందులో సుమారు 3,300 కేజీల మాద‌క‌ద్రవ్యాల్ని సీజ్ చేశారు. సుమారు 3089 కేజీల ఛార‌స్‌, 158 కేజీల మెటా ఫెట‌మైన్‌, 25 కేజీల మార్ఫైన్‌ను చిన్న షిప్ లో స్మగ్లింగ్ చేస్తున్నట్లు నేవీ తెలిపింది. ఇటీవ‌ల కాలంలో ఇదే అతి పెద్ద డ్రగ్స్ పట్టివేత అని అధికారులు వెల్లడించారు. ఆ షిప్‌లో ఉన్న ఐదుగురు పాకిస్థానీల‌ను అదుపులోకి తీసుకున్నారు. కొన్నిరోజుల క్రితం పుణెలో సుమారు 2500 కోట్లు రూపాయల ఖ‌రీదు చేసే 1100 కేజీల మెఫిడ్రోన్ అనే డ్రగ్స్ ను సైతం పట్టుకున్న విషయం తెలిసిందే.

➡️