324 హైకోర్టు జడ్జీ పోస్టులు ఖాళీ

Dec 8,2023 10:45 #CPIM, #John Brittas

 

సత్వరమే భర్తీ చేయండి: బ్రిట్టాస్‌

న్యూఢిల్లీ: దేశంలో 324 హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాజ్యసభలో సిపిఐ(ఎం) సభ్యులు జాన్‌ బ్రిట్టాస్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి ఈ విషయం తెలియజేశారు. దేశంలోని వివిధ మొత్తం మంజూరైన న్యాయమూర్తుల పోస్టులు 1114 కాగా, ప్రస్తుతం 790 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నట్లు కేంద్రం అందించిన గణాంకాలు చెబుతున్నాయి. పైగా, 324 ఖాళీ పోస్టుల్లో 198 ఖాళీల భర్తీకి వివిధ హైకోర్టు కొలీజియంలు ఇంకా సిఫారసులు చేయలేదు.దాదాపు 30 శాతం న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల న్యాయవ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోంది. దేశంలో లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నప్పుడు చాలా ఖాళీలు ఉన్నాయి. అందువల్ల ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి తక్షణమే చర్యలు తీసుకోవాలని జాన్‌ బ్రిట్టాస్‌ కోరారు

➡️