321 మందికి రూ.2.45 కోట్ల లబ్ధి

Feb 20,2024 20:46

లబ్ధిదార్లకు మెగా చెక్కును అందిస్తున్న టైనీ కలెక్టర్‌ కల్పశ్రీ, డిఆర్‌డిఎ పీడీ బాలునాయక్‌ తదితరులు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు, షాదితోఫా 5వ విడత జమను సిఎం జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుండి మంగళవారం ప్రారంభించారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టరేట్‌ నుండి కార్యక్రమంలో ట్రైనీకలెక్టర్‌ కల్పశ్రీ, లబ్ధిదార్లు పాల్గొన్నారు. ట్రైనీ కలెక్టర్‌ మాట్లాడుతూ పల్నాడు జిల్లా 321 మంది లబ్ధిదారులకు రూ.2.45 కోట్లు జమైనట్లు చెప్పారు. వీరిలో ఎస్సీలకు సంబంధించి 112 మందికి రూ.1.12 కోట్లు, (ఎస్సీల్లో కులాంతర వివాహం చేసుకున్న ఒకరికి రూ.1.20 లక్షలు), వికలాంగులు ఐదుగురికి రూ.7.50 లక్షలు, ఎస్టీలు 22 మందికి రూ.22 లక్షలు, (కులాంతర వివాహం చేసుకొన్న 8 మందికి రూ.9.60 లక్షలు), బీసీలు 159 మందికి రూ.79.50 లక్షలు, (కులాంతర వివాహం చేసుకొన్న ఐదుగురికి రూ.3.75 లక్షలు), మైనారిటికీ సంబంచించి 9 మందికి రూ.9 లక్షలు జమ చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా లబ్ధిదార్లకు మెగా చెక్కును అందించారు.బ కార్యక్రమములో డిఆర్‌డిఎ పీడీ బాలూనాయక్‌, ఇన్‌ఛార్జి సాంఘిక సంక్షేమాధికారి వరలక్ష్మి, వెనకబడిన తరగతుల సంక్షేమాధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

➡️