నామినేషన్ల కోలాహలంతిరుపతి జిల్లాలో 3+17 చిత్తూరు జిల్లాలో 3+1

నామినేషన్ల కోలాహలంతిరుపతి జిల్లాలో 3+17 చిత్తూరు జిల్లాలో 3+1

నామినేషన్ల కోలాహలంతిరుపతి జిల్లాలో 3+17 చిత్తూరు జిల్లాలో 3+13ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో నామినేషన్ల ప్రక్రియ రెండో రోజూ కోలాహలంగా సాగింది. అతిరథ మహారథులు శుక్రవారం నామినేషన్లను వేస్తూ, ర్యాలీలకు భారీ జనసమీకరణ చేశారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి గురువారమే కుప్పం చేరుకుని, శుక్రవారం దేవాలయం, మసీదు, చర్చిల్లో పూజలు, ప్రార్థనలు నిర్వహించి, భారీ ప్రదర్శనలో పాల్గొన్నారు. అనంతరం నామినేషన్‌పత్రాలను తహశీల్దార్‌కు అందజేశారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్‌కె రోజా సైతం భారీ జనసమీకరణతో విచ్చేసి నామినేషన్లు వేశారు. శుక్రవారం తిరుపతి జిల్లాలో ఎంపికి చింతామోహన్‌, మద్దిన గురుమూర్తి, సి.నవ్యకిరణ్‌ నామినేషన్‌ వేశారు. 17 మంది అసెంబ్లీకి దాఖలు చేశారు. చిత్తూరు జిల్లాలో ఎంపి అభ్యర్థులు ఎన్‌.రెడ్డెప్ప, ఎన్‌.రెడ్డెమ్మ, దుగ్గిరాల నాగేశ్వరరావు నామినేషన్లు వేశారు. 13 మంది అసెంబ్లీకి దాఖలు చేశారు. చిత్తూరు జిల్లా పార్లమెంట్‌వైసిపి టిడిపి కాంగ్రెస్‌ ఇతరులు2 – – 1చిత్తూరు జిల్లా అసెంబ్లీ తిరుపతి జిల్లా పార్లమెంట్‌వైసిపి టిడిపి కాంగ్రెస్‌ ఇతరులు2 – 1 -చిత్తూరు జిల్లా అసెంబ్లీ 3 6 2 67 4 – 2

➡️