గన్నవరం నియోజకవర్గంలో 2,79,054 మంది ఓటర్లు

Apr 25,2024 23:17

 ప్రజాశక్తి-గన్నవరం

గన్నవరంలోని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి గన్నవరం తాసిల్దార్‌ ఎన్‌.ఎస్‌ పవన్‌ కుమార్‌ ఆధ్వర్యంలో గన్నవరం నియోజకవర్గ స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయపార్టీలతో సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌.ఎస్‌ పవన్‌ కుమార్‌ మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రాల హేతుబద్దీకరణకు సంబంధించి వివరాలు మీకు అందజేయడం జరిగిందని, అలాగే పోలింగ్‌ కేంద్రాల వారిగా మండలాల ఓటర్‌ సంఖ్యను మీకు అందజేశామని, దీని ప్రకారం ఈ రోజుకి నియోజకవర్గ వ్యాప్తంగా 2,79,054 మంది ఓటర్లు ఉన్నారని, విజయవాడ రూరల్‌ మండలంలో 88,878 మంది, గన్నవరం మండలంలో 74,382 మంది, బాపులపాడు మండలంలో 71,954 మంది, ఉంగుటూరులో 43,840 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. అలాగే పోస్టల్‌ బ్యాలెట్‌ కి సంబంధించి ఈ నెల 26 (రేపటి) తో ఇషఉ్య చేయడానికి గడువు ముగుస్తుందని, ఫెలిసిటేషన్‌ సెంటర్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఎలాట్‌ అయ్యాక రెండు రోజులు కార్యక్రమం నిర్వహించి వారికి ఓటింగ్‌ వెయ్యడానికి అవకాశం కల్పిస్తామని తెలియజేశారు. ఓటర్‌ స్లిప్పుల పంపిణీ, సర్వీస్‌ ఓటర్‌ వివరాలు, మోడల్‌ పోలింగ్‌ కేంద్రాల గురించి వివరంగా రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేశారు. ఈ సందర్భంగా గన్నవరం నియోజకవర్గ టిడిపి పోల్‌ మేనేజ్మెంట్‌ కోఆర్డినేటర్‌ ఆళ్ళ వెంకట గోపాలకష్ణారావు మాట్లాడుతూ హౌమ్‌ ఓటింగ్‌ కి సంబంధించి ఎప్పటివరకు ఇషఉ్య చెయ్యటానికి గడువు ఉంది? ఎప్పుడు అప్లై చేసుకోవాలని అడగగా… ఈనెల 26వ తేదీ వరకు 85సంవత్సరాలు మించిన వారికి హౌమ్‌ ఓటింగ్‌ కు సమయం ఇచ్చామని, రేపు సాయంత్రం లోపుగా హౌమ్‌ ఓటింగ్‌ కి సంబంధించిన ఓటర్లు బి.ఎల్‌.ఓ లకు సమాచారం ఇస్తే వారికి హౌమ్‌ ఓటింగ్‌ కి అవకాశం కల్పిస్తామని తెలియచేశారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు నాదెండ్ల మోహన్‌ (బిజెపి), తంగిరాల శ్రీనివాస్‌ (టిడిపి), నీలం ప్రవీణ్‌ కుమార్‌ (వైయస్సార్సీపీ), వెలగా నరశింహారావు (సిపియం), ఎన్నికల డిప్యూటీ తహసీల్ధార్‌ ఏ.ఎస్‌.ఆర్‌ గోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️