ఉపాధి హామీ పథకం కూలీలకు రోజుకు 272 వేతనం : జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మిశ

Feb 22,2024 12:53 #272, #District Collector, #laborers, #Wages

తిరుపతి : ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూ. 272 వేతనం అందేలా పనులు చేయించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌. జి.లక్ష్మిశ ఆదేశించారు. గురువారం ఉదయం డ్వామా పిడి. శ్రీనివాస్‌ ప్రసాద్‌ తో కలిసి రేణిగుంట మండలం, విప్పమానుపట్టేడ పంచాయతీ కి చెందిన సూరప్ప కసం వద్ద జరుగుతున్న ఉపాధి హామీ పనులను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ … ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేస్తున్న కూలీలకు రోజు వేతనం రూ. 272 వారికి అందేలా చూడాలని, వారి ద్వారా పనులు చేయించాలని డ్వామా పిడి ని ఆదేశించారు. ఉపాధి పనులు చేస్తున్న ప్రాంతం వద్ద వర్క్‌ ఫెసిలిటీస్‌ కల్పించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ కూలీలతో మాట్లాడుతూ … వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు. కూలీలు వారి బాధలను కలెక్టర్‌కు విన్నవించారు. రూ.4.54 లక్షలతో నిర్మాణం చేపడుతున్న పామ్‌పాండ్‌ పనుల్లో విప్పమానుపట్టేడ పంచాయతీ కి చెందిన 34 మంది కూలీలు గత 20 రోజులుగా పని చేస్తున్నారని కూలీలకు పనిచేసే ప్రాంతంలో తాగునీరు కల్పిస్తున్నామని జాబ్‌ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి పనులు కల్పిస్తున్నామని పిడి కలెక్టర్‌ కు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఉపాధి హామీ కూలీలతో కలసి పనులు చేసేవారితో గ్రూప్‌ ఫోటో దిగారు. ఈ కార్యక్రమంలో వర్క్‌ ఐ డి ఇంచార్జి జయంతి, ఫీల్డ్‌ టెక్నికల్‌ అసిస్టెంట్లు కూలీలు, తదితరులు పాల్గొన్నారు.

➡️