2529 మందికి రూ.3.79 కోట్ల లబ్ధి

జిల్లాలో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన

చెక్కు అందజేస్తున్న కలెక్టర్‌ మనజిర్‌ జిలాని సమూన్‌

ఇబిసి నేస్తం చెక్కును అందజేసిన కలెక్టర్‌

ప్రజాశక్తి-శ్రీకాకుళం అర్బన్‌

జిల్లాలో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన 2529 మంది మహిళలకు ప్రభుత్వం గురువారం రూ.3.79 కోట్లు నిధులు విడుదల చేసినట్టు కలెక్టర్‌ మనజిర్‌ జిలాని సమూన్‌ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో జరిగిన కార్యమ్రంలో ఇబిసి నేస్తం నమూనా చెక్కును ఆయన లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రెడ్డి, కమ్మ, క్షత్రియ, బ్రాహ్మణ, వెలమ ఇతర ఒసి కులాలకు చెందిన 45-60 ఏళ్ల మధ్య వయస్సుగల పేద మహిళల ఆర్థికాభివృద్ధికి ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ పథకం కింద ఏటా రూ.15 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బిసి కార్పొరేషన్‌ ఈడి గెడ్డమ్మ, కళింగ కోమటి కార్పొరేషన్‌ చైర్మన్‌ అందవరపు సూరిబాబు, పొందర కూరాకుల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ రాజాపు హైమావతి, టి.కామేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

 

➡️