36 గంటల దీక్ష భగం అప్రజాస్వామికం

మాట్లాడుతున్న వెంకటేశ్వర్లు

ప్రజాశక్తి-అమలాపురం

ఉపాధ్యా యులకు రావలసిన పిఎఫ్‌, ఎపిజిఎల్‌ఐ, పిఆర్‌సి బకాయిల కొరకు ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ జనవరి 9, 10 తేదీలలో విజయవాడలో చేపట్టిన 36 గంటల దీక్షను పోలీసులు భగం చేయుట అప్రజాస్వామిక విధానం అని వెంకటేశ్వర్లు ప్రకటించారు. గురువారం అమలాపురం యుటిఎఫ్‌ హోంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు సుమారుగా రూ.18,096 కోట్లు చెల్లించవలసి ఉందన్నారు. ఈ ఆర్థిక బకాయిలు చెల్లించేవరకు ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు చేసిన మా పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. దీనిలో భాగంగా 14న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాన్ని దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు పి.వెంకటేశ్వరావు, ప్రధాన కార్యదర్శి ఎంటివి.సుబ్బారావు, జిల్లా గౌరవ అధ్యక్షులు బేతినీడి శ్రీనివాసరావు, జిల్లా అసోసియేట్‌ అధ్యక్షుడు సురేంద్ర, జిల్లా ట్రెజరర్‌ కేశవరావు పాల్గొనినారు.

 

➡️