29 నుండి ఎఫ్‌సివి పొగాకు వేలం

Feb 22,2024 08:10 #speech, #tobbaco board directer

జిఎన్‌టి-7 సమావేశంలో మాట్లాడుతున్న బోర్డు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌

ప్రజాశక్తి-గుంటూరు:రాష్ట్రంలో 2024 కాలానికి ఎఫ్‌సివి పొగాకుపంట వేలం అమ్మకాలకు టబాకో బోర్డు షెడ్యూలు విడుదల చేసింది. ఈ నెల 29వ తేదీ నుండి మూడు దశలుగా వేలం నిర్వహించనున్నారు. మొదటి దశలో 29న ఒంగోలు-1, కొండపిలో, మార్చి 6వ తేదీన కందుకూరు-1, 2, వెల్లంపల్లిలో, రెండో దశలో మార్చి 14వ తేదీన ఒంగోలు-2, టంగుటూరు, కలిగిరి, డిసి పల్లి, కనిగిరి, పొదిలి, దేవరపల్లి, గోపాలపురం, కొయ్యగూడెం, జంగారెడ్డి గూడోం1, 2లలో వేలం నిర్వహించనున్నారు. ఈ మేరకు వేలం తేదీల నిర్థారణకు బుధవారం గుంటూరు పొగాకు బోర్డు నిర్వహించిన సమావేశంలో బోర్డు చైర్మన్‌ చిడిపోతు యశ్వంత్‌ కుమార్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అద్దంకి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ పొగాకు రైతులు తమ పంటకు తగిన మార్కెటు ధర కల్పించడానికి బోర్డు అధికారులు తమ వంతు కృషి, సహాయం చేస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో బోర్డు వైస్‌చైౖర్మన్‌ గుత్తా వాసుబాబు, ఒంగోలు, రాజమండ్రి రీజనల్‌ మేనేజర్‌, బోర్డు సభ్యులు, వ్యాపార సంఘాల ప్రతినిధులు, పొగాకు రైతు సంఘ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

➡️