27 నుండి ‘మేమంతా సిద్ధం’

Mar 19,2024 08:29 #ap cm jagan, #tour
  •  రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర
  •  ప్రకటించిన జగన్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ‘మేమంతా సిద్ధం’ పేరుతో 27వ తేది నుండి రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రను చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి, వైసిపి అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. క్యాంప్‌ కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న ఎన్నికల ప్రచారంతో పాష్ట్ర మేనిఫెస్టో రూపకల్పనపై పార్టీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌లతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయం తెలిపారు. బస్సు యాత్రను జయప్రదం చేసేందుకు కృషి చేయాలని చెప్పారు. బస్సుయాత్ర ద్వారా ఎక్కువ సమయం ప్రజల్లోనే ఉండేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. పోలింగ్‌కు సమయం ఎక్కువగా వున్నందున ప్రతి నియోజకవర్గంలో ప్రచారం చేస్తానని, అభ్యర్థులు కూడా ప్రజలతో ఉండేందుకే ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. మొదటి విడత ప్రచారంలో భాగంగా సిద్ధం సభలను విజయవంతం చేసుకున్నట్లుగానే రెండో విడతగా చేపట్టనున్న బస్సు యాత్రను జయప్రదం చేసుకోవాలని సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఈ సందర్బంగా పేర్కొన్నారు. తెలుగుదేశం, జనసేన,బిజెపి కూటమిని ఎదుర్కొనేందుకు పకడ్బందిగా ప్రచారాన్ని నిర్వహించాలని ఆదేశించారు.రాష్ట్రంలో 81 అసెంబ్లీ, 18 పార్లమెంట్‌కు అభ్యర్థులను మార్చడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నట్లు తెలిపారు.
ఇడుపుల పాయ నుండి ప్రారంభం
27వ తేదీల్లో ఇడుపులపాయలో వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించిన అనంతరం బస్సు యాత్ర ప్రారంభమవుతుందనిసిఎం టూర్‌ షెడ్యూల్‌ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం చెప్పారు. మీడియాతో మాట్లాడిన ఆయన శీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు ఈ యాత్ర సాగుతుందని తెలిపారుబహిరంగ సభలు అయ్యాక ఆ పార్లమెంట్‌ పరిధిలోని అభ్యర్థులతో పాటు ముఖ్యనాయకులతో జగన్‌ చర్చిస్తారని, రాత్రికి అక్కడే బస చేస్తారని చెప్పారు.ఉదయం పూట ప్రజలతో ముఖాముఖి, మద్యాహ్నాం బహిరంగ సభ వుంటుందని తెలిపారు.

➡️