25 ఓపెన్‌ ఇసుక రీచ్‌లకు అనుమతి

Dec 30,2023 22:19
జిల్లా పరిధిలో గుర్తించబడిన

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం

జిల్లా పరిధిలో గుర్తించబడిన 25 ఓపెన్‌ ఇసుక రీచ్‌లకు సంబంధించి అనుమతులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె. మాధవీలత ఆదేశించారు.కొవ్వూరు డివిజన్‌ పరిధిలోని 3 ఓపెన్‌ ఇసుక ర్యాంపుల అనుమతులు డిసెంబర్‌ 7, 27తేదీలలో ముగిసిందని, కావున రాబోయే రెండు రోజుల లో క్లియరెన్స్‌ ఇవ్వాలని ఆదేశించారు. జిల్లా కమిటీ ఆమోదం పొంది నూతనంగా ఇసి దరఖాస్తు చేసుకున్న రాజమహేంద్రవరం డివిజన్‌ లోని 4, కొవ్వూరు డివిజన్‌లోని 18 కి సంబంధించి 15 రోజుల్లో క్లియరెన్స్‌ చేయలని ఆదేశించారు. అక్రమ తవ్వకాలు జరిపే వారి విషయంలో కఠినంగా వ్యవహ రిస్తామని హెచ్చరించారు. భద్రత చర్యలలో భాగంగా బ్యారేజ్‌, వంతెన పరిసర ప్రాంతాల్లో 500 మీటర్ల వరకు ఎటువంటి ఇసుక తవ్వకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, ఆయా ప్రాంతాల్లో బ్యారికెేటింగ్‌లను ఏర్పాటు చేసి నియంత్రణ పద్ధతులు అమలు చేయాలని సూచించారు. ఇందుకు సంబం ధించి సమన్వయ శాఖలతో కమిటీ వేసినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో చేపట్ట వలసిన పనులను చేపట్టి నివేదిక అందచేయాలని ఆదేశించారు. జిల్లాలో కొత్తగా 5 ప్లస్‌ హెక్టార్ల ఇసుక ర్యాంపులకు సంబంధించి గుర్తించాలని, అందులో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ చేపట్టి 15 రోజుల్లో కార్యాచరణ పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జెసి ఎన్‌.తేజ్‌ భరత్‌, కొవ్వూరు సబ్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవత్సవ, ట్రైనీ కలెక్టర్‌ సి.యశ్వంత్‌ కుమార్‌, జిల్లా మైన్స్‌ అధికారి ఎమ్‌.సుబ్ర హ్మణ్యం, ఇరిగేషన్‌ ఇఇ, డిడి భూగర్భ జలాలు వై.శ్రీనివాస్‌, పోలీస్‌, సెబ్‌, డిపిఒ, రవాణా, ఇఇ గోదావరీ వాటర్‌ హెడ్స్‌, పర్యావరణ, మైన్స్‌ అధికారులు, ప్రతిమ ఇన్ఫ్రా స్ట్రక్చర్‌ లిమిటెడ్‌ ప్రతినిధులుపాల్గొన్నారు.

➡️