16 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

ప్రజాశక్తి-పీలేరు అక్రమంగా తరలిస్తున్న 16 ఎర్రచందనం దుంగలతో పాటు కారును స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి డివిజనల్‌ పీలేరు అటవీ శాఖ నిఘా విభాగం డిఎఫ్‌ఒ ఎం. శివకుమార్‌ తెలిపారు. ముందుగా అందిన సమాచారం మేరకు ప్లైయింగ్‌ స్క్వాడ్‌ బందం పట్టణంలోని ఎల్లమంద క్రాస్‌ సమీపంలో శుక్రవారం వాహనాల తనిఖీ చేపట్టామని అన్నారు. ఈ సందర్భంగా ఉదయం 4 గంటలకు మారుతి స్విఫ్ట్‌ డిజైర్‌ వాహనం రావడం గమనించి ఆపేందుకు ప్రయత్నించా మన్నారు. ఆ వాహన డ్రైవరు యూనిఫాంలో ఉన్న తమ బందాన్ని గుర్తించి వాహనాన్ని ఆపకుండా వేగంగా ముందుకు వెళ్లిపోయాడని చెప్పారు. అప్రమ త్తమైన తమ బందం వెంటనే ఆ వాహనాన్ని వెంబడించగా ఆ వాహనం కొంత దూరం ఆపి అందులోని వారు బయటకు దూకి, చీకట్లో చెట్ల పొదల్లోకి పారిపో యారని చెప్పారు. వాహనంలో తనిఖీ చేయగా అందులో 565 కేజీల బరువు గల 16 ఎర్రచందనం దుంగలను గుర్తించి, స్వాధీనం చేసుకున్నామని అన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఎఫ్‌ఎస్‌ఒ కె. వెంకటేశ్వర్లు, ఎఫ్‌బిఒలు డి. రమణమూర్తి, జి. కొదండన్‌, వై. చంద్రబాబు, ఎఒబి ఎం. ప్రసాద్‌ కుమార్‌, స్ట్రైకింగ్‌ ఫోర్సు సిబ్బంది పి. మునిస్వామి, డి.భార్గావ్‌, కె.ధర్మచందు పాల్గొన్నారు.

➡️