14 రోజుకు మున్సిపల్‌ కార్మికుల సమ్మె

14 రోజుకు మున్సిపల్‌ కార్మికుల సమ్మె

ప్రజాశక్తి-యంత్రాంగం మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన సమ్మె సోమవారం 14వ రోజుకు చేరుకుంది. అమలాపురం సిఐటియు ఆధ్వర్యాన కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. నూకల బలరామ్‌ మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని అన్నారు. రాబోయే కాలంలో చెత్త మొత్తాన్ని ఎంఎల్‌ఎలు, మంత్రుల ఇళ్ల వద్ద డంపింగ్‌ చేస్తామన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శులు దుర్గాప్రసాద్‌, కృష్ణవేణి మాట్లాడుతూ ఇప్పటికే నగరాలన్నీ చెత్తతో నిండిపోయి ఉన్నాయని, దోమలు బాగా పెరిగిపోయాయని ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందని ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయమైన డిమాండ్స్‌ పరిష్కరించి సమ్మెను విరమింప చేసే చర్యలు తీసుకోవాలని అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కారెం వెంకటేశ్వరరావు, ఐద్వా జిల్లా నాయకురాలు వరలక్ష్మి, మాట్లాడారు. కొండ, శ్రీనివాసు, నరేంద్ర, అజరు కుమార్‌, సుబ్బారావు, లక్ష్మి, ప్రసన్న మాట్లాడారు. మండపేట, ముమ్మిడివరం, రామచంద్రపురం మున్సిపల్‌ నాయకులు కార్మికులు పాల్గొన్నారు. మున్సిపల్‌ కార్మికుల సమ్మె శిబిరం వద్ద పోస్టల్‌ సంఘం నాయకులు రామకష్ణ, వెంకటేశ్వరరావు, రమేష్‌, యునైటెడ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు వి.గణపతి రావు, టిఎన్‌టియుసి నాయకులు మోహన్‌ రావు, శివరావు, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడు మెట్ల రమణబాబు, జిల్లా కార్యదర్శి సోంబాబు కార్మికులకు మద్దతు తెలిపారు. సిఐటియు, ఎఐటియుసి నాయకులు కె.సత్తిబాబు, టి.గోపి, పి.కోటి, ఎన్‌.మూర్తి, ఎ.ప్రసాదు, ఎం.రాంబాబు, ఎ.బాబీ, గూడుపు వరలక్ష్మి, అనంతలక్ష్మి, లీలావతి, సుశీల, బుజ్జి, కొప్పుల బాబీ, నిమ్మకాయల శ్రీను, వెంకట్రావు, పి.రాజేష్‌, బి.చిన్ని, మీసాలు, బంకయ్యమ్మ, జంగా రామయమ్మ, రాయుడు సుబ్బలక్ష్మి, పి.సాయమ్మ పాల్గొన్నారు.ముమ్మిడివరం నగర పంచాయతీ నుంచి అమలాపురం కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన ధర్నాకు పెద్ద ఎత్తున కార్మికులు తరలి వెళ్లారు. ఎస్‌.అరుణ్‌ కుమార్‌, నక్కా అరుణ్‌, ఎం.శ్రీనివాసరావు, కాశి జార్జి, జి.రమేష్‌, ఎస్‌.శరత్‌, ఎ.సత్తిబాబు, వెంకట రమణ, వెంకటేశ్వరరావు, రామరాజు, ఈశ్వర్‌, గోవింద్‌, బొజ్జమ్మ, రమణమ్మ, మహాలక్ష్మి, మాణిక్యం, మంగ పాల్గొన్నారు.

➡️