తన హావభావాలను చక్కగా పలికిస్తూ చేసిన డబ్స్మాష్ వీడియోలతో సోషల్‌మీడియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న తమిళనటి మృణాళిని రవి. సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటోంది. తమిళంలోనే కాదు, తెలుగులోనూ అభిమానుల్ని సంపాదించుకుంది. 'గద్దలకొండ గణేష్' చిత్రంలో తెలుగమ్మాయి బుజ్జమ్మగా మురిపించింది. ఆమె ఇన్‌స్టా పరిచయమూ ఆ పేరే.
* మృణాళిని రవి పుదుచ్చేరిలో పుట్టింది. బెంగళూరులో పెరిగింది. తల్లిదండ్రులు చెన్నైకి చెందినవారు. పుదుచ్చేరిలో ఇంజినీరింగ్ పూర్తిచేసిన మృణాళిని బెంగళూరులోని ప్రముఖ ఎంఎన్‌సిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది.
* సినిమాల్లోకి వస్తుందని అస్సలు ఊహించలేదట.టేదో సరదాగా డ్యాన్స్ చేయడం, డబ్స్మాష్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వరకే పరిమితమం అనుకునేదట..! బంధువులు, స్నేహితుల్లో ఎవరూ సినీ నేపథ్యం ఉన్నవారులేరు.
* అంతే కొన్ని వారాల్లోనే సోషల్‌మీడియా సెలెబ్రిటీ అయిపోయింది మృణాళిని. 2016 ఫేవరేట్ డబ్స్మాష్ అవార్డు కూడా అందుకుంది.
* ఆమె వీడియోలు వైరల్ అయ్యి మోడలింగ్ అవకాశాలు వచ్చాయి. వాటిని చేస్తూ సినిమా చాన్స్ కోసం ప్రయత్నించింది.
* ప్రస్తుతం ఆమెకు లక్షమందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు.
* సురేష్ కుమార్ దర్శకత్వంలో 'నాగల్'లో నటించింది. కానీ, అది ఇంకా రిలీజ్ కాలేదు.
* 'సూపర్‌డీలక్స్'లో ఒక క్యారెక్టర్‌కు ఆడిషన్స్‌లో పాల్గొంది. దీనిలో ఆమె నటన మెచ్చుకుని దర్శకుడు పది నిమిషాల నిడివి పాత్రలో నటించే అవకాశమిచ్చారు. ఈ పాత్రలో ఆమె నటనకు గుర్తింపు రావడంతో 'చాంపియన'్ చిత్రంలో లీడ్ రోల్లో నటించే అవకాశం అందుకుంది.
* లేడీ సూపర్‌స్టార్ నయనతార ఆమె ఇష్టమైన నటి. ప్రస్తుతం ఇటు ఉద్యోగం అటు సినిమాల్లో కెరీర్ బ్యాలెన్స్ చేస్తోంది.