మనీషా కథ కొంచెం ట్రికీగా వున్నా బాగా హ్యాండిల్ చేయడం నాకు నచ్చింది. కథ ముగింపు కూడా బావుంది. వాస్తవానికి అటువంటి పరిస్థితిలో ఎవరు ఎలా ప్రవర్తిస్తారో తెలీదుగానీ, ఊహ మాత్రం ఉన్నతంగా ఉంది.
- కాకర్లమూడి విజరుకుమార్, హైదరాబాద్
మంచంలో ఉన్న భర్త మనోభావాలు ఎలా ఉండి ఉంటాయో అన్న అలోచన కారణంగా సహజంగానే మగాడి మనసు భిన్నంగా ఉంటుంది. 'మనిషా' కథలో ఆదర్శ మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఇలాతలంలో అరుదు, తన మరణం తర్వాత కూడా తన జ్ఞాపకాలలోనే జీవించాలని కోరుకుంటూ ఉంటారు.
- శమంతకమణి దుత్తా, విజయవాడ
పేదింటి సాకర్
రియో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారుల వార్తలు హోరెత్తిస్తున్నాయి. క్రీడాకారులుగా రాణించాలంటే ఎంతో కృషిచేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆదరణ లేకున్నా స్వయంకృషితో అండర్ 14 బాలికల టీమ్ కెప్టెన్ స్థాయికి చేరుకున్న మీనా కుమారి జీవిత విషయాలు కళ్లను చెమర్చాయి. ప్రత్యేకించి నేరస్తుల కోసమే జైళ్లు ఏర్పాటు చేసినా పురాతనమైన జైళ్లను మ్యూజియంగా మార్చి, అందరికీ జైలు జీవిత అనుభవాన్ని అందించే ఆలోచన ఆశ్చర్యపరిచింది. యాభై సంవత్సరాల వయస్సులో బిపిన్ అగ్ని ప్రమాదాల నుండి బాధితులని రక్షించడం అభినందనీయం. పారాలింపిక్స్ పోరు, మనీషా కథ, అలా పాస్, పింక్ ఆటోస్ నిలువెత్తు స్మశానాలు, భూమికి గొడుగు, అట్టమీది కథ బాగున్నాయి.
- శిరీష, విజయవాడ
నిండు నూరేళ్ల గానం
11-09-2016 స్నేహ సంచికలో వచ్చిన అట్టమీది కథ 'నిండు నూరేళ్ల గానం' నన్ను అబ్బురపరిచింది. భక్తిరస మధుర గాయని గాత్రం నుంచి మంగళకరమైన, మధురమైన, మంజులమైన దివ్యగానామృతంలో ముంచెత్తిన ఎమ్.ఎస్. సుబ్బులక్ష్మిగారి ప్రతిభాపాటవాలను గురించి కొత్త విషయాలు వెలుగులోనికి తీసుకురావడం వ్యాసకర్తని అభినందించదగ్గ విషయం. సుబ్బులక్ష్మిగారు కారణ జన్ములు. ఆమె సంగీత గానకోకిల. ఆమె పాటల మాధుర్యాన్ని చవిచూడని వారుండరు.
- కై.ప నాగరాజు, అనంతపురం
పారాలింపిక్స్ పోరు
బ్రెజిల్లో అట్టహాసంగానే కాక స్ఫూర్తివంతంగా సాగిన పారాలింపిక్స్‌లో పోటీపడిన క్రీడాకారుల విజయ సమాహారం 'పారాలింపిక్స్ పోరు' ఆకట్టుకుంది. సాంటోస్ నగరంలోని మెమోరియల్ నెక్రోపోల్ ఎక్యుమెనికాగా పిలిచే 32 అంతస్తుల స్మశాన వాటిక వివరాలు ఆశ్చర్యపరిచాయి. రణతంబోర్ రాణి, జోర్డాన్ ఎడారి ప్రాంతంలోని గుహానగరం, స్వచ్ఛంద ఫైర్ ఫైటర్, నిండు నూరేళ్ల గానం, జోక్స్, కార్టూన్ పంచ్ బాగున్నాయి.
- పద్మప్రియ,
ఒంగోలు