విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
ప్రజాశక్తి కమలాపురం
విద్యుత్ ఘాతంతో చెట్టుపై నుంచి కిందపడి చెంచన్న గారు సుబ్బరాయుడు (53) మతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు గారు వంక వద్ద ఉన్న శ్రీ లలిత పరమేశ్వరి ఆలయం ఎదుట ఉన్న ఓ చెట్టుకొమ్మలు తొలగించేందుకు కష్ణా నగర్‌కు చెందిన సుబ్బరాయుడు వెళ్లాడు. చెట్టు ఎక్కి కొమ్మను కత్తితో నరుకుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు కొమ్మలపై పడ్డాయి. దీంతో పైనుంచి కిందపడ్డాడు. వెంటనే స్థానికులు గమనించి హుటాహుటిన పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అప్పటికే మతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
