ముగ్గురు మట్కా నిర్వాహకులు అరెస్టు
ప్రజాశక్తి-బద్వేలు
పట్టణంలో మట్కా నిర్వహిస్తున్న ముగ్గరిని బుధవారం అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ.33, 400 నగదును స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్ సిఐ రమేష్ బాబు తెలిపారు. బుధవారం స్థానిక అర్బన్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మట్కా నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో దూదేకుల వీధికి చెందిన మహమ్మద్ రఫీ, శివ నగర్ కు చెందిన రామకష్ణ అతడి భార్య వెంకట సుబ్బమ్మ లను అరెస్టు చేశామని చెప్పారు. పట్టణంలోని రామాంజనేయ నగర్ కు చెందిన తిరుమలయ్య అనే వ్యక్తికి మట్కా డబ్బులను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. తిరుమలయ్య కోసం కూడా గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు మట్కా ఆడుతూ కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారని ఎవరు కూడా మట్కా జోలికి వెళ్లకుండా ఉండాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
