ప్రజాశక్తి-బద్వేల్ అర్బన్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బేటీబచావో, బేటీ పడావో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి పథకం ఆడపిల్లలకు వరంలాంటిదని తహశీ ల్దార్ పుల్లారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని మైదుకూరు రోడ్డులో ఉన్న పోస్టల్ ప్రధాన కార్యాలయంలో ఆయన కుమార్తె అశ్వితపై ఖాతాను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఆడపిల్లల పట్ల తల్లిదండ్రులు వివక్ష చూపుతూ తక్కువ చేస్తున్నారన్నారు. పురుషులతో సమానంగా మహిళలను చూసినప్పుడు దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుందని చెప్పారు. తల్లిద ండ్రులు తమ ఆడపిల్లల అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం అత్యంత ఆదరణ లభిస్తోందన్నారు. ఆడపిల్లల భవిష్యత్‌కు బంగారు బాట వేసినట్లవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆడపిల్లలకు వరం 'సుకన్య సమృద్ధి పథకం'
