* కాంగ్రెస్‌కు వైట్‌హౌస్ స్పష్టీకరణ
వాషింగ్టన్: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అమెరికన్ కాంగ్రెస్ ప్రతినిధుల సభ చేపట్టిన అభిశంసన విచారణలో వైట్‌హౌస్ పాల్గొనబోదని ట్రంప్ తరపు న్యాయవాది పాట్ సిప్పోలోన్ తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రతినిధుల సభ జుడీషియరీ కమిటీ ఛైర్మన్ జెర్రీ నాడ్లర్కు ఒక లేఖ రాశారు. ప్రతినిధుల సభా సంఘం జరిపే విచారణ నిష్పాక్షికంగా వుంటుందన్న భావన తమకు కలకడం లేదని, అధ్యక్షుడి పట్ల కమిటీ నిష్పాక్షికంగా వ్యవహరిస్తుందా లేదా అన్న విషయంలో స్పష్టత లేనందున వైట్‌హౌస్ ఈ విచారణలో పాల్గొనబోదని ఆయన తేల్చిచెప్పారు. ఈ నిర్ణయానికి అనుగుణంగా ప్రస్తుత పరిస్థితుల్లో బుధవారం నాటి విచారణకు తాము హాజరు కావటంలేదని ఆయన వివరించారు.
అభిశంసన విచారణలో పాల్గొనం..!
