- రోవర్స్ పంపిన ఛాయా చిత్రాలే సాక్ష్యాలు
- అమెరికా పరిశోధకుడు విలియం రోమోసర్
వాషింగ్టన్ : అంగారకునిపై కీటకాల లాంటి జీవులు ఉన్నాయనడానికి సాక్ష్యం ఉందని అమెరికాలోని ఓహియో యూనివర్సిటి పరిశోధకుడు, ప్రొఫెసర్ ఎమెరిటస్ విలియం రోమోసర్ విశ్వసిస్తున్నాడు. అంగారకునిపై ప్రాణమున్న జీవులు ఉన్నాయా, లేదా అనే విషయమై నిర్ధారణకు వచ్చేందుకు ఒక ప్రక్క శాస్త్రవేత్తలు మల్లగుల్లాలు పడుతున్న సమయంలో మరో వైపు రోమోసర్ జీవులున్నాయని విశ్వసిస్తూ, వివిధ మార్స్ రోవర్స్ వెలువరించిన చాయా చిత్రాలను ఇందుకు సాక్ష్యంగా చూపిస్తున్నారు. కీటకాలు, తేనె టీగలు, సరీసృపాలు, శిలాజాల రూపాలలో ఉన్న జీవులు ఉన్నాయని ఆయన వెల్లడించారు. వివిధ మార్స్ రోవర్లు పంపిన ఛాయా చిత్రాలు అక్కడ శిలాజాలు, జీవులు ఉన్నట్లు చూపుతున్నాయన్నారు. ''మార్టిన్ క్రిమి లాంటి జంతుజాలంలో స్పష్టమైన వైవిధ్యం ఉంది. టెర్రాన్ కీటకాల వలే ఇవి అనేక లక్షణాలను కలిగి ఉన్నాయి. ఇవి అధునాతన సమూహాలుగా చెప్పబడుతున్నాయి. ఉదాహరణకు రెక్కల ఉనికి, చురుకైన గ్లైడింగ్లు, కాళ్ళకి సంబంధించిన వివిధ నిర్మాణాత్మక అంశాలు వాటిల్లో కనిపించాయి'' అని రోమోసర్ తెలిపారు. ప్రత్యేకించి క్యూరియాసిటి రోవర్ సేంద్రీయ కార్యకలాపాల కోసం పరిశీలన చేస్తుండగా క్రిములు, సరీసృపాల రూపాలను స్పష్టంగా వర్ణించే అనేక ఫొటోలు ఉన్నాయని ఆయన చెప్పారు. కీళ్ళు గల అకశేరుకాల వర్గానికి చెందిన శరీరాకృతి గల కీటకాలు కనిపించాయన్నారు.
రోవర్స్ పంపిన ప్రతి ఛాయా చిత్రాన్ని విడివిడిగా అధ్యయనం చేసినట్లు తెలిపారు. ఛాయా చిత్రాలకు సంబంధించిన వివిధ ప్రమాణాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు చెప్పారు. ఆ ఛాయా చిత్రాలకు కొత్త అంశాన్ని జోడించలేదని, ఉన్నదానిని తొలిగించలేదన్నారు. పరిసరాల నుండి నాటకీయ నిష్క్రమణ, రూపాల స్పష్టత, శరీర సమరూపత, శరీర భాగాల విభజన, పునరావృత భాగం, అస్థిపంజరాల అవశేషాలు, ఒకదానికి ఒకటి దగ్గరగా ఉన్న రూపాల పరిశీలన తదితరాలను ప్రామాణికాలుగా పరిగణనలోకి తీసుకుని పరిశోధన నిర్వహించినట్లు రోమోసర్ తెలిపారు.
అంగారకునిపై జీవాలున్నారు!
