* కళాశాలలో టీనేజర్ కాల్పులు, ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు
మాస్కో: ఇప్పటి వరకూ అమెరికాకు మాత్రమే పరిమితమైన తుపాకీ సంస్కృతి క్రమంగా రష్యాకు కూడా విస్తరిస్తోంది. అమెరికాలో అనేక ప్రాంతాలలో, ముఖ్యంగా విద్యాసంస్థల్లో సాయుధులు జరుపుతున్న కాల్పులను గుర్తుకుతెచ్చే విధంగా గురువారం ఉదయం రష్యాలోని ఒక కళాశాలలో 19 ఏళ్ల విద్యార్థి ఒకరు విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన ఘటనలో ఒక విద్యార్థి మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారని, తరువాత ఆ సాయుధుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడని అధికారులు చెప్పారు. బ్లాగోవెష్చెన్స్క్ పట్టణంలోని ఒక ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థి ఈ దురంతానికి పాల్పడ్డారని దర్యాప్తు కమిటీ వెల్లడించింది.
రష్యాకు విస్తరించిన తుపాకీ సంస్కృతి
