* తూర్పు జర్మనీ చివరి ప్రధాని హాన్స్ మాడ్రో ఆవేదన
బెర్లిన్: తూర్పు జర్మనీలో సోషలిస్టు వ్యవస్థ పతనం తరువాత ఉభయ జర్మనీల పునరేకీకరణ పేరుతో చారిత్రిక బెర్లిన్ గోడను కూల్చి మూడు దశాబ్దాలైంది. పునరేకీకరణ ఇప్పటికీ వాస్తవ రూపం దాల్చలేదని తూర్పు జర్మనీ ఆఖరి ప్రధాని హాన్స్ మాడ్రో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో వరుసగా వచ్చిన ప్రభుత్వాలు విఫలమయ్యా యని ఆయన ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తూర్పు, పశ్చిమ జర్మనీ మధ్య వైరుధ్యాలు, ముఖ్యంగా ఆర్థిక అసమానతల విషయంలో మరింత పెరిగాయి. గత మూడు దశాబ్దాల్లో జర్మనీ ఆర్థిక వ్యవస్థ ఇబ్బడి ముబ్బడిగా అభివృద్ధి చెందినప్పటికీ ప్రజలకు అవసరమైన రుణ సాయం అందించటంలో, జీవన ప్రమాణాలకు అనువైన ఫించన్ల పంపిణీలోను ఇరుప్రాం తాల మధ్య తీవ్ర అగాథమేర్పడింది. విలీనం తరువాత తాము ద్వితీయ శ్రేణి పౌరులుగా మారిపోయామనే భావన చాలా మంది తూర్పు జర్మన్లలో బలంగా గూడుకట్టుకుంది. ఉభయ జర్మనీల మధ్య కొనసాగుతున్న వైరుధ్యాలు, జీవన ప్రమాణాలలో తేడాలను సరిదిద్దాలని ఆయన జర్మనీ రాజకీయ నేతలను కోరారు. జర్మనీ పునరేకీకరణ తరు వాత ఆయన 1990-94 మధ్య కాలంలో జర్మన్ పార్ల మెంట్ దిగువ సభ సభ్యుడిగా వ్యవహరించారు.
బెర్లిన్ గోడ కూల్చారు పునరేకీకరణ మరిచారు
